ఆంధ్ర - ఒడిశా సరిహద్దు ప్రాంతమైన చిత్రకొండలో భారీ మొత్తంలో జరుగుతున్న గంజాయి అక్రమరవాణను మల్కాన్‌గిరి పోలీసులు భగ్నం చేశారు. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి జిల్లా ఎస్పీ జగ్‌మోహన్ మీనా తెలిపిన సమాచారం ప్రకారం ఈ నెల 5, 6 తేదీల్లో దాదాపు 100 మంది కావిళ్లతో కాలినడకన చిత్రకొండ ప్రాంతం నుంచి చత్తీస్‌ఘడ్‌కు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్మగ్లర్లను అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో...పోలీసులపై ఎదురుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బలిమెలకు చెందిన ఒక కానిస్టేబుల్‌కు గాయాలవగా కోరాపుట్ ఆసుపత్రికి తరలించారు.
ఈ సంఘటన అనంతరం 75 మందితో ఎస్‌ఓబీ ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ బలగాలు ఒడిశా మత్తిలీ ప్రాంతంలో గాలిస్తుండగా 34 మంది స్మగర్లు పోలీసులకు తారసపడ్డారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. 3300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ. 2 కోట్లు ఉంటుందని...ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో కోరాపుట్, మల్కాన్‌గిరి, నవరంగపూర్, చత్తీస్‌ఘడ్‌కు చెందిన స్మగర్లు ఉన్నారని తెలిపారు.
ఇవీ చూడండి : 10 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్న నైరుతి