ETV Bharat / briefs

నకిలీ నోట్ల బీటెక్ బాబు...కటకటాల పాలయ్యాడు - fake currency

చదివింది బీటెక్.. చేసేది ఘరాన మోసం. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో నకిలీ బాట ఎంచుకున్నాడు. ఇంజనీరింగ్​లో నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానంతో నకిలీ నోట్ల తయారీకి మొదలుపెట్టాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా  చిరువ్యాపారులే లక్ష్యంగా నకిలీ నోట్ల దందా ప్రారంభించాడు. గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న నకిలీ నోట్ల చలామణీపై నిఘా పెట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రూ. 13 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ నోట్ల బీటెక్ బాబు...కటకటాల పాలయ్యాడు
author img

By

Published : Jun 21, 2019, 6:38 AM IST

నకిలీ నోట్ల బీటెక్ బాబు...కటకటాల పాలయ్యాడు
ఉన్నత విద్య చదువుకుని డబ్బు కోసం అడ్డదారిలో పయనించి పోలీసులకు అడ్డంగా దొరికాడు. విజయవాడ కేంద్రంగా నకిలీనోట్ల దందా జోరుగా సాగిస్తూ...ఎవ్వరికీ అనుమానం రాకుండా చిరువ్యాపారులను లక్ష్యంగా చేసుకుని లక్షల రూపాయల నకిలీ నోట్ల మార్పిడి చేస్తున్నాడు ఓ బీటెక్ కుర్రాడు. నగరానికి చెందిన అశ్వనీకుమార్ తన తెలిసిన సాంకేతిక పరిజ్ఞానంతో స్కానర్​తో 2 వేలు, 100 రూపాయల నోట్లను కలర్ జిరాక్స్ తీసి అసలు నోట్లు చలామణీ చేస్తున్నాడు.

అశ్వనీకుమార్ తన స్నేహితుడు డేవిడ్ రాజుతో కలిసి..నగరంలోని కర్రి పాయింట్లు, క్యాంటీన్లు, కూరగాయల.. వ్యాపారులు, చిరువ్యాపారులతో పరిచయం చేసుకున్నాడు. తమకు పాత పరిచయమున్న మరో ఇద్దరికి నకిలీ నోట్లు ఇచ్చి చలామణీకి పాల్పడ్డారు. లక్ష రూపాయల అసలు నోట్లకు మూడు లక్షల నకిలీ నోట్లు ఇచ్చారు. నకిలీ నోట్ల చలామణీపై టాస్క్ ఫోర్స్ నిఘా పెట్టారు. పథకం ప్రకారం అశ్వనీకుమార్, డేవిడ్ రాజు పట్టుకున్నారు. మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 13 లక్షల రూపాయలు విలువ చేసే..2 వేలు, 100 రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

Intro:ap_vzm_36_19_asupatri_ni_sandarsinchina_mla గిరిజన ప్రాంతానికి గుండె కాయ ఉన్న ప్రాంతీయ ఆసుపత్రి అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఎమ్మెల్యే అలజంగి జోగారావు హామీ ఇచ్చారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతీయ ఆస్పత్రిని శాసనసభ్యులు అలజంగి జోగారావు సందర్శించారు ఆసుపత్రి భవనం కొత్తగా నిర్మితమవుతున్న నిర్మాణాలు ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు ఆధునిక యంత్రాలు సిబ్బంది అందిస్తున్న సేవలను ఆయన పరిశీలించారు అనంతరం వైద్యులు సిబ్బంది తో సమావేశం నిర్వహించారు ఆసుపత్రి పరిస్థితిని రోగుల తాకిడి సిబ్బంది ఆసుపత్రుల సౌకర్యాలను సూపరింటెండెంట్ జి నాగభూషణ రావు ఎమ్మెల్యే వివరించారు ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్య వైద్యం తాగునీరు పారిశుద్ధ్యం అంశాలకు ప్రాధాన్యత ఇస్తానన్నారు ప్రతి పేదవానికి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానన్నారు ఆస్పత్రి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానన్నారు వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు ఏ ఏ రకాల వివాదాలతో ప్రజలు వస్తున్నారో గుర్తించి వారికి పూర్తిస్థాయిలో నయం అయ్యే విధంగా అంతా కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు

Conclusion:ఆసుపత్రిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జోగారావు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.