జాతీయ విద్యా విధానం-2019లో ప్రతిపాదించిన అంశాలు విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ఉపయోగపడతాయని విశాఖకు చెందిన ఆచార్యులు అభిప్రాయపడ్డారు. విశాఖ పౌర గ్రంథాలయం వేదికగా జాతీయ విద్యా విధానం 2019(కస్తూరి రంగన్ కమిటీ నివేదిక)పై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో బోధన, పరిశోధన రంగాల్లో నూతన విద్యా విధానం అమలుతో గుణాత్మక మార్పులు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమైంది.
విశాఖలోని పౌర గ్రంథాలయంలో సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అండ్ డెవలప్మెంట్(సిడార్) ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో విశ్రాంత, ప్రస్తుత ఆచార్యులు పాల్గొన్నారు. పాఠశాల విద్య, కళాశాల విద్య, విశ్వవిద్యాలయ, అధ్యాపక పరిశోధన స్థాయిలలో ప్రమాణాలు పెంచే విధంగా కస్తూరి రంగన్ కమిటీ మే 31న కేంద్రానికి ఈ నూతన విద్యా విధానం డ్రాఫ్టు నివేదికను సమర్పించిందని వక్తలు తెలిపారు. ప్రస్తుతం దేశంలో కొన్ని రంగాల్లో మానవ వనరుల కొరత ఉందని, ఈ విద్యా విధానంలో సిఫార్సులను అమల్లోకి తీసుకువస్తే ఆ కొరతను తగ్గించుకోగలమని నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి : 'ఆధ్యాత్మిక ముసుగులో అక్రమాలు సరికావు'