డీజీపీ గౌతమ్ సవాంగ్ మహిళామిత్ర సభ్యులతో విజయవాడలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతోన్న దాడులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. నూతన ప్రభుత్వంలో హోంమంత్రి మహిళ కావటం మహిళలకు దక్కిన గౌరవమన్నారు. మహిళల రక్షణే ప్రాధాన్యతగా తెలిపారు. పోకిరీల ఆగడాలు అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. ఈవ్ టీజింగ్‌లో పట్టుబడిన వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. భార్యాభర్తల మధ్య వచ్చే కుటుంబ సమస్యలను మహిళా మండలి సభ్యులు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరిస్తారని తెలిపారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతీ కళాశాలలో యాంటీర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి కమిటీల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతామన్నారు. మహిళలు, చిన్నారుల మీద జరుగుతున్న ఆకృత్యాలపై ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీ సరితకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ఇదీ చదవండీ :