ETV Bharat / briefs

గాలేరు-నగరి పూర్తి చేసి నీళ్లిస్తా: సీఎం చంద్రబాబు - చంద్రబాబు

పోలవరం పనులపై మోదీ అబద్ధాలు చెబుతున్నారని మండిపడిన చంద్రబాబు.. నగరి ప్రజలు గోదావరి నది నీళ్లు తాగబోతున్నారని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా జలాశయాలు, చెరువులకు నీళ్లిచ్చే బాధ్యత నాదేనని భరోసా ఇచ్చారు.

సీఎం చంద్రబాబు
author img

By

Published : Apr 2, 2019, 7:34 PM IST

సీఎం చంద్రబాబు
చిత్తూరు జిల్లా పుత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం... నగరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. నర్మదా ప్రాజెక్టు కట్టేందుకు మోదీకి పదేళ్లు పట్టిందన్న బాబు.. ఐదేళ్లలోనే పోలవరం కట్టి చూపిస్తానన్నారు. ఏపీలో ఎక్కడచూసినా ఎనీ టైమ్ వాటర్‌ తెదేపా ఘనతని తెలిపారు.

వెనుకబడిన వర్గాల పాఠశాల విద్యార్థులకు వెయ్యి రూపాయల ఉపకార వేతనం ఇస్తామని చెప్పిన సీఎం... ఫీజులను సైతం మేమే కడతామని ప్రకటించారు. యువతకు ఇంటర్‌ నుంచే నిరుద్యోగ భృతి ఇస్తానన్న చంద్రబాబు.. గ్రామాలు, పట్టణాల్లో ఉచితంగా ఇళ్లు కట్టిస్తామన్నారు. నగరి, పుత్తూరు, తిరుపతి కలిసి మెగాసిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రతి ఒక్క యువకుడికి ఉపాధి కల్పిస్తానని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.

ఇవీ చూడండి కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో.. ఏపీకి ప్రత్యేక హోదా

Intro:jk_ap_vja_42_02_jaggaiahpeta_muneru_canal_devalopment

Body:మున్నేరు కాలువ ఆధునీకరణ పనులు

Conclusion:సెంటర్ జగ్గయ్యపేట లింగస్వామి. బైట్స్ వరుసగా 1 . పొన్నం బాలాజీ రైతు 2 పొందూరు శ్రీనివాస రావు రైతు 3 జొన్నలగడ్డ రాధాకృష్ణమూర్తి రైతు 4 యార్లగడ్డ విశ్వనాథం ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ 5 రహీమ్ నీటిపారుదల శాఖ అధికారి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.