ఈ విషయం తెలుసుకున్న స్థానిక క్రైస్తవులు పోలీసులను అడ్డుకున్నారు. కమలమ్మ ఆరోపణలలో అసత్యమని, చర్చి ఫాదర్ మంచివాడంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ చర్యతో చర్చి వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు అదనపు బలగాలను రప్పించారు. క్రైస్తవులు ఫాదర్ ఉన్న ఇంటికి తాళం వేసి ఇంట్లోకి పోలీసులు వెళ్ళకుండా అడ్డుకున్నారు. పోలీసులు మరో ద్వారం ద్వారా ఇంట్లోకి ప్రవేశించి ఫాదర్ కోసం గాలించగా..అప్పటికే ఫాదర్ పరారయ్యాడు. స్థానిక యువకులే ఫాదర్ను తప్పించారని అక్కడున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో యువకుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని తమ పిల్లలను వదిలివేయాలంటే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ జయ రామసుబ్బారెడ్డి ఠాణా వద్దకు చేరుకుని..తల్లిదండ్రులతో మాట్లాడి యువకులను వదిలిపెట్టారు. అంతటితో ఆందోళన సద్దుమణిగింది.
ఇవీ చూడండి : పెళ్లి కొడుకుకు ఆకతాయి ఫోన్.. పీటలపై ఆగిన పెళ్లి