టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు.... మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తెలిపారు. ఉప నేతలు, విప్ పదవులు ఎవరికి ఇవ్వాలనే నిర్ణయాన్ని చంద్రబాబుకే అప్పగించినట్లు వెల్లడించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ... పార్టీ ఓడడంపై విశ్లేషిస్తున్నట్లు చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి చెప్పారు. ఇన్‌ఛార్జి వ్యవస్థతో పార్టీకి, కేడర్‌కు అంతరం పెరిగిందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంగా తాము ప్రజల తరఫున పోరాడతామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ: జగన్‌ను కలవనున్న "కింజరాపు, పయ్యావుల, గంటా"