ఘటనా స్థలంలో 11 మంది చనిపోయారు. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. మాదకద్రవ్యాల నిరోధక ఆపరేషన్లో భాగంగా చేపట్టిన తనిఖీల్లో భారీగా డ్రగ్స్, తుపాకులు, ఆయుధసామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ప్రపంచంలోని అత్యంత విధ్వంసకర నగరాల్లో ఒకటిగా రియో డి జెనీరో పేరుగాంచింది. ఇక్కడ తరుచుగా డ్రగ్స్ ముఠాలు, పోలీసుల మధ్య కాల్పులు జరుగుతుంటాయి. ఏటా లక్షమందిలో సుమారు 50 మంది కాల్పుల్లో మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.