ETV Bharat / briefs

కాబోయే సీఎంకు అధునాతన వాహన శ్రేణి సిద్ధం

రాష్ట్ర ఎన్నికల్లో జయభేరి మోగించి ఈ నెల 30న సీఎంగా ప్రమాణ స్వీకరం చేయబోతున్న జగన్​కు నూతన వాహన శ్రేణి సిద్ధమైంది. ఆరు అధునాతన వాహనాలను అధికారులు సిద్ధం చేశారు. AP18 P 3418 నెంబర్ ఉన్న వాహనాలు జగన్ ఇంటికి చేరుకున్నాయి.

జగన్​ నూతన వాహన శ్రేణి
author img

By

Published : May 24, 2019, 2:57 PM IST

జగన్​ నూతన వాహన శ్రేణి

నవ్యాంధ్రకు ద్వితీయ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్ కోసం ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక కాన్వాయ్​ సిద్ధం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి జగన్ నివాసం వద్ద భద్రతను పెంచిన పోలీసులు, ఆ ప్రాంతాన్నంతా మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. స్థానిక ఇళ్లలోనూ సోదాలు జరిపారు. జగన్ వాహన శ్రేణిలో బులెట్​ప్రూఫ్ వాహనం, మొబైల్ సిగ్నల్ జామర్, అంబులెన్స్, సెక్యూరిటీ సిబ్బంది వాహనాలు ఏర్పాటు చేశారు. ఆరు వాహనాల కాన్వాయ్​కు AP18 P 3418 నంబరు కేటాయించారు. ఈ వాహనాలన్నీ ప్రస్తుతం జగన్ ఇంటి ముందే నిలిచివున్నాయి. ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్ డబ్ల్యూ) రంగంలోకి దిగి, జగన్ భద్రతను పర్యవేక్షిస్తోంది.

ఇవీ చూడండి : ట్రెండింగ్ కేఏ పాల్​...ఎక్కడ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.