ETV Bharat / briefs

సంచలనం: రాష్ట్ర ఎన్నికల నిర్వహణలో మరో వివాదం

author img

By

Published : Apr 17, 2019, 4:28 PM IST

అర్థరాత్రి 12 గంటలకు ఎన్నిక పూర్తయింది. తెల్లారి రాత్రి 9 గంటలకు ఈవీఎంలు ఈసీ అధికారుల చేతికి అందాయి. ఈ మధ్య సమయంలో.. ఏం జరిగింది? రిటర్నింగ్ అధికారి చెబుతున్నట్టు నిద్ర లేమే ఈవీఎంల తరలింపునకు కారణమైందా? లేదా.. మరేదైనా కుట్ర దాగి ఉందా?

evms

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి.. మరో వివాదం సంచలనమవుతోంది. అర్థరాత్రి 12 గంటలకు పోలింగ్ ముగిసినా... మరుసటి రోజు రాత్రి 9 గంటలకు ఈవీఎంలు ఎన్నికల సంఘం అధికారుల చేతికి చేరడం వివాదాస్పదంగా మారింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వెలుగూచూసిన ఈ ఘటన.. కొత్త అనుమానాలకు తావిస్తోంది.

పెనమలూరులోని కానూరు పంచాయితీలో ఓ పోలింగ్ కేంద్రంతో పాటు... యనమలకుదురు, వణుకూరుల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల తరలింపు వ్యవహారం.. తాజా వివాదానికి కారణమైంది. అర్థరాత్రి 12 గంటలకు పోలింగ్ ముగిస్తే.. తెల్లారి రాత్రి 9 గంటలకు ఈవీఎంలు ఎన్నికల సిబ్బంది చేతికి అందాయి. వీటిని తీసుకునేందుకు తిరస్కరించిన ఎన్నికల సంఘం అధికారులు.. రిటర్నింగ్ అధికారి ఇచ్చిన వివరణతో విస్తుపోయారు. 3 రోజులుగా నిద్ర లేని కారణంగానే పొరపాటు జరిగిందనీ.. అందుకే పడుకుని లేచిన అనంతరం ఈవీఎంలు అప్పగిస్తున్నామని సదరు అధికారి ఇచ్చిన వివరణ.. అధికారులను అయోమయానికి గురి చేసింది.

పెనమలూరు నియోజకవర్గంలో మొత్తం 303 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఎక్కడా ఈవీఎంలు మొరాయించిన ఘటనలు నమోదు కాలేదు. కేవలం 2 కంట్రోల్ యూనిట్లు, ఒక వీవీప్యాట్ నే మార్చాల్సి వచ్చింది. కానూరు పంచాయతీలో ఒక పోలింగ్ కేంద్రం, యనమలకుదురులో రెండు, వణుకూరులో ఒక పోలింగ్ కేంద్రంలో రాత్రి వరకూ పోలింగ్ కొనసాగింది. పెనమలూరు నియోజకవర్గ పంపిణీ కేంద్రాన్ని..... సమీపంలోని ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూంలు మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయం భవనాల్లో ఏర్పాటు చేశారు. 11 వ తేదీ అర్థరాత్రి లోపే పోలింగ్ ముగిస్తే.. 12 వ తేదీ రాత్రి 9 గంటలకు ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలు స్ట్రాంగ్ రూముకు వెళ్లాయి. ఈ అంశం తమ దృష్టికి రాలేదని.. వచ్చిన తర్వాత ఈసీ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు చేపడతామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఈ ఘటనపై.. ఎన్నికల సంఘం అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కు ఈసీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఏఆర్వోగా ఉన్న నూజివీడు తహసీల్దార్ పి.తేజేశ్వరరావును సస్పెండ్ చేసినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Jakarta - 17 April 2019
1. Wide of room where Indonesian President Joko Widodo is watching the preliminary electoral results with his team
2. Close of Widodo watching the results, chatting and laughing
3. Wide of room with large screen showing several TV stations covering the elections
4. Various of Widodo and his table
5. Wide of room with large screen showing several TV stations covering the elections
6. Widodo's table
7. Various of room
STORYLINE:
Vote counts from five independent survey groups show Indonesian President Joko Widodo has a clear election lead over rival Prabowo Subianto.
The quick counts from reputable survey organisations that use a sample of polling stations have been reliable in past elections.
Official results from Wednesday's election are expected in May.
With 50% to 80% of sample polling stations counted, the survey organisations showed Widodo winning about 55% of the vote.
Around 193 million people were eligible to vote in polls that will decide who leads the world's most populous Muslim-majority nation.
Widodo campaigned on progress in reducing poverty and improving Indonesia's infrastructure.
Subianto, a former special forces general, painted a picture of a weak Indonesia at risk of disintegration without his leadership.
He also promised to lower prices of essential goods.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.