దిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రవేశాల కోసం రాష్ట్రానికి చెందిన విద్యార్థుల ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ ఇంటర్ బోర్డు ఇచ్చిన సీజీపీఏ గ్రేడ్‌ను దిల్లీ వర్సిటీ మార్పులు చేయడమే ఇందుకు కారణమైంది. సీజీపీఏ గ్రేడ్‌ను 10కి బదులు 9.5తో గుణిస్తున్న కారణంగా.. రాష్ట్ర విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం.. సీజీపీఏను 10తో గుణించి పర్సెంటేజీ తీసుకోవాలని నిబంధన ఉన్నా.. దిల్లీ వర్సిటీ తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటోంది. అక్కడ చదువుకోవాలని చాలా కాలంగా కష్టపడి.. ఇతర వర్సిటీల్లో సీట్లు వదులుకుని ఎదురుచూస్తున్న తమకు.. తాజా పరిణామం చాలా ఆవేదన కలిగిస్తోందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. 500 కు పైగా విద్యార్థులు రాష్ట్రం నుంచి దిల్లీ వచ్చారని చెప్పారు. ప్రభుత్వం స్పందించి ఈ మేరకు తమ సమస్య పరిష్కరించాలని.. లేదంటే ఎక్కడా అడ్మిషన్ దొరకని పరిస్థితిలో విద్యాసంవత్సరం నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.
దిల్లీ వర్సిటీ అన్యాయం.. ఆదుకోవాలి ప్రభుత్వం - delhi university
ప్రతిష్టాత్మక దిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకోవాలనుకున్న రాష్ట్ర విద్యార్థులను.. ఆ వర్సిటీ తీరు ఇబ్బందులపాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వమే తమ సమస్య పరిష్కరించకుంటే.. విద్యా సంవత్సరం నష్టపోవాల్సి వస్తుందన్న ఆవేదన.. వారిలో వ్యక్తమవుతోంది.