ETV Bharat / briefs

విజయవాడలో యువజన కాంగ్రెస్ దీక్ష

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యతగా రాజీనామాకు సిద్ధపడిన రాహుల్ గాంధీ...తన అభిప్రాయాన్ని మార్చుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ కొనసాగాలంటూ యువజన కాంగ్రెస్ నేతలు విజయవాడలో నిరాహార దీక్ష చేపట్టారు.

యువజన కాంగ్రెస్ నిరాహార దీక్ష
author img

By

Published : May 29, 2019, 3:50 PM IST

ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ కొనసాగాలని విజయవాడ ఆంధ్రరత్న భవనంలో యువజన కాంగ్రెస్ నాయకులు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. సార్వత్రిక ఎన్నికల్లో పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. రాహుల్ గాంధీ రాజీనామా నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని నేతలు కోరుతున్నారు. కార్పొరేట్ల అండదండలతో మోదీ ఎన్నికల్లో గెలిచారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు గురునాథం ఆరోపించారు. గతంలో కన్నా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం పెరిగిందన్న ఆయన పార్టీ ఓటమికి రాహుల్ గాంధీ ఒక్కరే కారణం కాదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ ఆవశ్యకత ఎంతో ఉందన్నారు.

యువజన కాంగ్రెస్ నిరాహార దీక్ష

ఇవీ చూడండి : ఖాకీ కళాకారుడికి లాఠీనే ఫ్లూటు

Lucknow (UP), May 29 (ANI): A petrol pump cashier and another person were shot at by two miscreants on May 28 in Uttar Pradesh's Lucknow. According to police, "Injured have been admitted to hospital. Rs 4-5 lakh cash which they were carrying at the time wasn't looted. Case has been registered, efforts on to nab the accused".
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.