ఈత నేర్చుకోవాలన్న సరదా ఆ చిన్నారుల పాలిట శాపంగా మారింది. ఈత కోసం క్వారీలోకి దిగిన ఆ ముగ్గుర బాలురు అందులో మునిగి మృతి చెందారు. ఈ విషాద ఘటన విశాఖ జిల్లా అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం తారకరామ కాలనీలో విషాదాన్ని నింపింది.
కొంతకాలంగా కురిసిన వర్షాలకు గ్రామానికి సమీపంలో ఉన్న క్వారీ వర్షపు నీటితో నిండింది. ఆదే గ్రామానికి చెందిన నీల కాయల బాలాజీ(12), పొడుగు గిరీష్(11), నందనవనం శరత్ చంద్ర(12) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. సెలవులు కావడం వల్ల ఈత నెర్చుకోవాలన్న సరదాతో ఆ ముగ్గులు.. మరో ఇద్దరు చిన్నారులతో కలిసి క్వారీకి వెళ్లారు. క్వారీలోకి దిగిన ఆ ముగ్గురు సరిగా ఈదరాక, లోతు ఎక్కువగా ఉండటం మునిగిపోయారు. బయట ఉన్న ఇద్దరు చిన్నారులు వెంటనే కేకలు వేస్తూ గ్రామంలోకి వెళ్లి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకునన్న గ్రామస్థులు నీట మునిగిన ఆ చిన్నారులను బయటకు తీయగా అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనకాపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ అదనపు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు.
గ్రామంలో విషాదం...
ముగ్గురు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి. కూలి పని చేసుకుంటూ జీవిస్తున్న వారి కుటుంబాల్లో తీరని విషాదన్ని మిగిల్చింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కొడుకులు కాలరాని లోకాలకు వెళ్లారని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
చదువులో చురుగ్గా ఉండేవారు..
ఆ చిన్నారు చదువులో చురుగ్గా ఉండేవారని టీచర్లు పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుగుణా దేవీ చిన్నారుల మృతి పట్ల సంతాపం తెలిపారు. ప్రస్తుతం కుంటలు నీటితో నిండుగా ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి: