ETV Bharat / state

CYLINDER BLAST: పెట్రోల్​ బంక్​ సమీపంలో ప్రమాదం..సిలిండర్​ పేలి - Exploded cylinder at medapadu

cylinder blast
రోడ్డుపై పేలిన సిలిండర్
author img

By

Published : Sep 7, 2021, 4:28 PM IST

Updated : Sep 7, 2021, 10:21 PM IST

16:24 September 07

ఆటోలో తరలిస్తుండగా పేలిన సిలిండర్.. నిలిచిపోయిన వాహన రాకపోకలు

ఆటోలో తరలిస్తుండగా పేలిన సిలిండర్

  తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం జెడ్​.మేడపాడు వద్ద ఆటోలో సిలిండర్లు తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆటోలో కార్బన్‌డైయాక్సైడ్(Co2) సిలిండర్లను తరలిస్తుండగా.. స్థానిక పెట్రోలు బంకు సమీపంలో సిలిండర్​​ పేలింది. ఆటో వెనుక వెళ్తున్న ద్విచక్రవాహనదారుడిపై సిలిండర్​ పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే బాధితుడిని అనపర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. 

ఈ క్రమంలో కెనాల్ రోడ్డులో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డుపై పడి ఉన్న సిలిండర్లను అగ్నిమాపక సిబ్బంది(Fire fighters) తొలగించారు. ఘటనా స్థలా‌న్ని మండపేట పోలీసులు పరిశీలించారు. ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
 
ఇదీ చదవండి..

NREGS Bills: 15లోపు చెల్లించకపోతే కోర్టు ధిక్కార చర్యలు: హైకోర్టు

Last Updated : Sep 7, 2021, 10:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.