ETV Bharat / state

ప్రైవేటు ల్యాబ్‌లలో కొవిడ్ పరీక్షలకు రాష్ట్ర సర్కార్ అనుమతి - ఆంధ్రప్రదేశ్​లో కరోనా పరీక్షలు వార్తలు

covid tests in andhra pradesh
covid tests in andhra pradesh
author img

By

Published : Jul 27, 2020, 2:45 PM IST

Updated : Jul 27, 2020, 3:22 PM IST

14:42 July 27

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తీవ్రస్థాయిలో ఉండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐసీఎంఆర్ అనుమతించిన ప్రైవేటు ల్యాబ్​లలో కొవిడ్ పరీక్షలకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రభుత్వం నుంచి పంపే నమూనాలు, ప్రైవేటుగా సేకరించే నమూనాల పరీక్షకు ధరలు నిర్ణయిస్తూ వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి సోమవారం ఆదేశాలు ఇచ్చారు.  

ధరలివే...

ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్స్​లలో ర్యాపిడ్ యాంటీజెన్ ద్వారా పరీక్షలకు 750 రూపాయలకన్నా ఎక్కువ వసూలు చేయరాదని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఆర్టీపీసీఆర్ ద్వారా చేసే ఒక్కో నమూనా పరీక్షకు 2800 ధరను నిర్ధారించింది. ఈ మొత్తంలోనే ర్యాపిడ్ కిట్​తో పాటు  పీపీఈ కిట్లు, మానవనరుల వ్యయం ఉంటుందని ప్రభుత్వం ప్రైవేటు ల్యాబ్​లకు, ఆస్పత్రులకు స్పష్టం చేసింది.  

పర్యవేక్షణ ఇలా..

ఈ ధరలకు పరీక్షలు నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్​లు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు ధరఖాస్తు చేయాలని... ఈ వ్యవహారాలను ప్రత్యేక నోడల్ అధికారి పర్యవేక్షిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఐసీఎంఆర్ వెబ్​సైట్​లకు కూడా ఈ పరీక్షల ఫలితాలను అప్​లోడ్ చేయాలని వైద్యారోగ్యశాఖ ప్రైవేటు ల్యాబ్స్​కు సూచించింది. ప్రైవేటు అస్పత్రులు, ల్యాబ్​లలో జరిగే పరీక్షలు, వసూలు చేస్తున్న ధరలను పర్యవేక్షించాల్సిందిగా జిల్లా వైద్యాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.  

ఇదీ చదవండి

దేశంలో కొత్తగా 49,931 కేసులు.. 708 మరణాలు

Last Updated : Jul 27, 2020, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.