ETV Bharat / bharat

అరుణాచల్​ప్రదేశ్​లో చైనా 'గ్రామం'.. భారత్​ స్పందన ఇదే! - అమెరికా చైనా

అరుణాచల్​ప్రదేశ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా నిర్మించుకున్న గ్రామం(china village in india).. ఆ దేశ ఆధీనంలోనిదేనని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి(india china news). 1959లో ఆ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుందని, అప్పటి నుంచి నిర్మాణాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నాయి.

china village in india
అరుణాచల్​ప్రదేశ్​లో చైనా 'గ్రామం'.. భారత్​ స్పందన ఇదే!
author img

By

Published : Nov 9, 2021, 3:17 PM IST

అరుణాచల్​ప్రదేశ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా గ్రామం నిర్మించిందని(china village in india) అమెరికా పెంటగాన్​ ఇటీవలే ఓ నివేదికలో పేర్కొంది(us china news ). తాజాగా.. ఆ గ్రామం చైనా నియంత్రణ ఉన్న ప్రాంతంలోనే ఉన్నట్టు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి.

"అప్పర్​ సుబాన్​సిరి జిల్లా వద్ద ఉన్న వివాదాస్పద సరిహద్దు వెంబడి చైనా గ్రామం నిర్మించుకుంది. అయితే అది చైనా నియంత్రణలో ఉన్న ప్రాంతమే. 1959లో అసోం రైఫల్స్​ పోస్ట్​ను ఆక్రమించుకున్న పీఎల్​ఏ.. అక్కడ తన సైనిక దళాలను మోహరించింది. అప్పటి నుంచి ఆ ప్రాంతం చైనా ఆధీనంలోనే ఉంది. అనేక నిర్మాణాలు చేపట్టింది."

--- భారత సైనిక వర్గాలు.

భారత్‌-చైనా వివాదాస్పద సరిహద్దు(india china latest news) ప్రాంతంలో చైనా వంద ఇళ్లు నిర్మించినట్లు.. అమెరికా ర‌క్షణ‌ శాఖ తమ పార్లమెంటుకు ఓ నివేదిక‌ సమర్పించింది. మెక్ మెహ‌న్ రేఖ‌కు ద‌క్షిణాన భార‌త స‌రిహ‌ద్దుల్లో ఈ గ్రామం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అరుణాచ‌ల్‌లోని భారత భూభాగం పరిధిలో డ్రాగన్‌ ఓ గ్రామం నిర్మించిన విష‌యాన్ని ఉప‌గ్రహ ఛాయాచిత్రం ఆధారంగా ఓ ఇంగ్లిష్ టీవీ ఛానెల్ ఈ ఏడాది ఆరంభంలో ఓ వార్తా కథ‌నం ప్రసారం చేసింది. టిబెట్ అటాన‌మ‌స్ రీజియ‌న్‌, భార‌త్‌లోని అరుణాచ‌ల్‌ ప్రదేశ్​ మ‌ధ్య ఈ గ్రామాన్ని చైనా 2020 మ‌ధ్యలో ఎప్పుడో నిర్మించి ఉంటుంద‌ని అమెరికా ర‌క్షణ‌ శాఖ పేర్కొంది.

ఈ నివేదికలో గతేడాది జూన్‌లో జరిగిన గల్వాన్‌ ఘర్షణను ప్రస్తావించింది అమెరికా రక్షణ శాఖ. నలుగురు పీఎల్​ఏ సైనికులకు చైనా అవార్డులు ప్రకటించినట్లు పేర్కొంది. అయితే చైనా వైపు ఎంతమంది చనిపోయారన్నదానిపై స్పష్టత లేదని తెలిపింది. భారత్‌ వైఖరి వల్లే తాము ఎల్‌ఏసీ వెంట సైనిక మోహరింపులు చేపట్టినట్లు చైనా అంటోందని అమెరికా రక్షణశాఖ వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంట మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు నిలిపివేయటం సహా భారత్‌ తన సైన్యాన్ని ఉపసంహరించుకునే వరకు తాము వెనక్కి వెళ్లేదిలేదని చైనా పేర్కొన్నట్లు తెలిపింది. సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటూ చైనా విసురుతున్న సవాలును ఎదుర్కొవాల్సిన ఆవశ్యకతను ఈ నివేదిక గుర్తు చేసింది.

ఇదీ చూడండి:- 'ఒక్కో జవానుపై రూ.11లక్షలు'.. చైనా విషయంలో భారత్‌ తగ్గేదేలే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.