UP Assembly Election 2022: శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఉత్తర్ప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా ముజఫర్నగర్ జిల్లాలో ఎమ్మెల్యే నామినేషన్ తిరస్కరించారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఒకరు ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంటానని బెదిరించారు.
ఇదీ జరిగింది..
మిరాంపుర్ అసెంబ్లీ సీటు ఆయనకే దక్కుతుందని ఆప్ నేత జోగిందర్ సింగ్ ధీమాతో ఉన్నారు. అయితే.. రిటర్నింగ్ ఆఫీసర్ సోమవారం జోగిందర్ నామినేషన్ను తిరస్కరించారు. దీంతో జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ ముందు జోగిందర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అనంతరం జోగిందర్.. కలెక్టర్ ఆఫీస్ ముందే ధర్నాకు దిగారు. నామినేషన్ పత్రంలో ఏదైనా పొరపాటు జరిగితే.. అది సరిచేసుకునేందుకు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిక్కు అయినందువల్లే తన నామినేషన్ను తిరస్కరించారంటూ అధికారులపై సంచలను ఆరోపణలు చేశారు.
ఇదీ చదవండి:
UP assembly elections : 159 మంది అభ్యర్థులను ప్రకటించిన ఎస్పీ