ETV Bharat / bharat

మృత్యువులోనూ వీడని అనుబంధం.. అన్న మరణవార్త విని తమ్ముడు కూడా... - పంజాబ్​ అప్డేట్​

Two Brothers Died In One Day: అన్నయ్య మరణ వార్త విని తట్టుకోలేక అతడి తమ్ముడు కూడా చనిపోయాడు. ఈ ఘటన పంజాబ్​లో జరిగింది. ఇద్దరు సోదరులు ఒకే రోజు మరణించడం వల్ల ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Two Brothers Died In One Day
Two Brothers Died In One Day
author img

By

Published : May 4, 2022, 3:47 PM IST

Two Brothers Died In One Day: అన్నదమ్ములంటే ఒకరికొకరు తోడుగా ఉంటూ.. ఒకరికి కష్టం వస్తే మరొకరు తానున్నానే భరోసా ఇస్తుంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఆస్తుల గొడవల్లో సోదరుడనే ప్రేమ భావం లేకుండా కొందరు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఇప్పటికీ సోదరుడంటే ప్రాణం ఇస్తున్నారనడానికి ఈ విషాద ఘటనే నిదర్శనం. అన్న అకాల మరణాన్ని తట్టుకోలేకపోయిన తమ్ముడు కుప్పకూలాడు. ఈ ఘటన పంజాబ్​లోని భటిండాలో జరిగింది.

అసలు ఏం జరిగిందంటే?.. పంజాబ్​లోని భటిండా నగరానికి చెందిన ప్రీతమ్ సింగ్(75) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మెరుగైన చికిత్స కోసం స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం మరింత క్షీణించి చికిత్స పొందుతూ ప్రీతమ్ సింగ్ మృతి చెందాడు. కుటుంబసభ్యులు.. ప్రీతమ్ సింగ్ మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు.

అన్నయ్య మరణ వార్త విని తట్టుకోలేక కొంత సమయానికి అతడి తమ్ముడు మంజిత్ ఇందర్ సింగ్ అలియాస్ అమర్జిత్ సింగ్(68) కూడా మరణించాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమర్జిత్​ సింగ్​ అంత్యక్రియలను అతడి కుమార్తె నిర్వహించింది.

మరణించిన అన్నదమ్ములిద్దరూ శిరోమణి అకాలీదల్​ పార్టీ నాయకులు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కులదీప్ కౌర్.. మృతుల కుటుంబ సభ్యులను కలిసి సంతాపం వ్యక్తం చేశారు. ప్రీతమ్​ సింగ్​ చాలా మంచి వ్యక్తి అని, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసేవారని ఆమె గుర్తు చేసుకున్నారు. వారి మరణం కుటుంబంతో పాటు పార్టీకి కూడా తీరని లోటు అని ఆమె చెప్పారు.

ఇదీ చదవండి: మైనర్​పై​ అత్యాచారం.. పోలీసు స్టేషన్​ గదిలోకి తీసుకెళ్లి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.