ETV Bharat / bharat

Tirumala srivari Navaratri Brahmotsavam 2023: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమల క్షేత్రం.. నేడు అంకురార్పణ - ap news

Tirumala srivari Navaratri Brahmotsavam 2023 Arrangements: కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీనివాసుని నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏపీలోని తిరుమల క్షేత్రం ముస్తాబవుతున్నాయి. సప్తగిరీశుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు జరగనున్నాయి. ఇప్పటికే గత నెలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇప్పుడు నవరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

tirumala-srivari-navaratri-brahmotsavam-2023

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 7:50 AM IST

Updated : Oct 14, 2023, 2:00 PM IST

Tirumala srivari Navaratri Brahmotsavam 2023 Arrangements : సప్తగిరీశుని నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల గిరులు ముస్తాబవుతున్నాయి. నేడు ఉత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరగనుంది. అధిక మాసం కారణంగా సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తోంది. ఇప్పటికే సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించింది. నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా విజయవంతం చేయాలని అధికారులు లక్షలాదిగా తరలి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తోంది.

సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఊహించిన స్థాయిలో భక్తులు రాకపోవడంతో దసరా సెలవుల నైపధ్యంలో భారీగా భక్తులు తరలివస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం సిద్దం అయింది. నేడు సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంను అర్చకులు వైభవంగా నిర్వహించనున్నారు. స్వామివారి సేనాదిపతులైన విష్వక్కేనుల వారు ఆలయం నుంచి ప్రదక్షణగా తిరువీధుల్లో ఊరేగుతూ ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో అంకురార్పణకు కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించి ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పిస్తారు.

TTD EO Dharma Reddy on Tirumala Navaratri Brahmotsavam 2023: "15 నుంచి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఏర్పాట్లు పూర్తి"

Tirumala Navaratri Brahmotsavam from October 15 to 23 : అనంతరం రేపు రాత్రి 7 గంటలకు పెద్ద శేషవాహన సేవతో బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజుల పాటు స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాలలో ప్రధానమైన ఘట్టం గరుడ వాహన సేవ 19వ తారీఖున జరగనుంది. బ్రహ్మోత్సవాల ఆఖరి రోజు ఈ నెల 23వ తారీఖున శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించే చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది.

తిరుమలలో రేపటి నుండి 23వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంభందించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ధర్మారెడ్డి వెల్లడించారు. అధికమాసం రావడంతో ఈ ఏడాది స్వామివారి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న ఉత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడవాహన సేవ 19వ తేదీ జరగనుందని..అలాగే 20వ తేదీ సాయంత్రం పుష్పకవిమానం, అక్టోబరు 22న స్వర్ణరథం, 23న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఈవో తెలిపారు.

దసరా సెలవులు దృష్ట్యా నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పెద్దసంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, రద్దీకి అనుగుణంగా సామాన్యభక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేశామన్నారు. గరుడవాహనసేవను తిలకించేందుకు ఉదయం నుండి భక్తులు వేచి ఉంటారని, ప్రస్తుతం 7 గంటలకు ప్రారంభించే వాహనసేవను సాయంత్రం 6:30 గంటలకే ప్రారంభించేలా అర్చకులతో సంప్రదింపులు చేస్తామన్నారు.

Devi Navratris 2023 What To Wear : దేవీ నవరాత్రులు.. తొమ్మిది రోజులు 9 వస్త్రాలు ధరించాలి.. అవేంటో మీకు తెలుసా..?

బ్రహ్మోత్సవాల్లో సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు భక్తులకు కల్పించే అన్ని వెసులుబాటు దర్శనాలు రద్దు చేసినట్లు ప్రకటించారు. గ్యాలరీలలో కూర్చోని వాహనసేవను తిలకించే భక్తులను అలరించేందుకు 15 రాష్ట్రాల నుండి కళాకారులను పిలిపిస్తున్నామని చెప్పారు. జిల్లా అధికార యంత్రాంగం, పోలీసు విభాగంతో సమన్వయ పరచుకొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తామన్నారు.

చంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు అధిక మాసం వస్తుందని, అధికమాసం కావడంతో శ్రీవారి ఆలయంలో స్వామివారికి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందనీ ఆలయ ప్రధానోర్చకులు కృష్ణ శేషాచల దీక్షితులు తెలిపారు. అధిక మాసం పురస్కరించుకొని గత నెలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగిందన్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం వైదిక కార్యక్రమాలు ఉండవన్నారు. 19న సాయంత్రం సూర్యాస్తమయిన వెంటనే 6:30 గంటలకు గరుడ సేవ ప్రారంభించడం జరుగుతుందన్నారు. వాహన సేవల్లో మహారథోత్సవం బదులు స్వర్ణ రథం,పుష్పక విమానం సేవలు ఉంటాయని ఆయన అన్నారు.

Dussehra 2023 Celebrations in AP: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు.. సాధారణ ఛార్జీలతోనే ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Last Updated : Oct 14, 2023, 2:00 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.