సాగు చట్టాలపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. హరియాణా బహాదుర్గఢ్లో (Bahadurgarh news) గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మహిళా రైతులు (Farmers killed) ప్రాణాలు కోల్పోయారు. మరో మహిళా రైతు గాయపడ్డారు. కాలికి తీవ్ర గాయం అయిన ఆమెను రోహ్తక్లోని పీజీఐ ఆస్పత్రికి తరలించారు.
ఇద్దరు మహిళా రైతులు ఘటనాస్థలిలోనే మరణించగా.. మరొకరు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మృతులను భాన్ సింగ్(60), హర్జీత్ సింగ్(58), భోలా సింగ్(60)గా గుర్తించారు.
ఆటో కోసం ఎదురుచూస్తుండగా..
నిరసన చేస్తున్న ఏడుగురు మహిళలు ఝాజ్జర్ రహదారి డివైడర్‌పై కూర్చున్నారని ఎస్పీ వసీమ్ అక్రమ్ తెలిపారు. ఆటో కోసం వీరంతా ఎదురుచూస్తున్నారని చెప్పారు. తెల్లవారుజామున 5.30 గంటలకు ఘటన జరిగిందని, ప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్ పారిపోయాడని చెప్పారు. వాహనాన్ని సీజ్ చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వివరించారు.
ఇదీ చదవండి: నిరసనలో హింస- ఇద్దరు రైతులు సహా 8 మంది మృతి!