అత్యంత ఎత్తులో ఉండే లక్ష్యాలను వేగంగా చేరుకుని మట్టికరిపించే సామర్థ్యం గల 'అభ్యాస్' వైమానిక వాహనాన్ని(DRDO Abhyas test) రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) అధికారులు విజయవంతంగా పరీక్షించారు. ఒడిశా తీర ప్రాంతంలోని ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ రేంజ్ నుంచి దీన్ని ప్రయోగించారు.
మొదటగా అభ్యాస్ వైమానిక వాహనానికి తక్కువ ఎత్తులోఉన్న లక్ష్యం నిర్దేశించగా అనుకున్న సమయంలో లక్ష్యాన్ని ఛేదించింది. ముందుగా లక్ష్యాన్ని వైమానిక వాహనంలో నిక్షిప్తం చేసి.. అనంతరం రిమోట్ కంట్రల్‌తో గ్రౌండ్ బేస్ నుంచే ఆపరేట్ చేసేందుకు వీలు ఉంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్‌డీఓ రూపొందించిన ఈ అభ్యాస్ వైమానిక వాహనం.. శత్రు దేశాల వైమానిక దాడులను తిప్పి కొట్టడంలో కీలక పాత్ర పోషించనుంది.
ఇదీ చూడండి: 'ఆపరేషన్ సర్ప్‌వినాశ్'ను తలపించేలా పూంచ్ ఎన్‌కౌంటర్!
ఇదీ చూడండి: చైనాకు దీటుగా సరిహద్దులో భారత్ యుద్ధ సన్నద్ధత