04.35
సచివాలయం ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌కు వెళ్లిన రేవంత్ రెడ్డి
సీఎం హోదాలో తొలిసారిగా రేవంత్‌రెడ్డి సచివాలయానికి వెళ్లారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సీఎంకు సచివాలయ అధికారులు, ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు. సచివాలయం ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌కు రేవంత్ రెడ్డి వెళ్లారు.
04.01
మంత్రులకు శాఖలు కేటాయింపు
మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి శాఖలు కేటాయించారు. వీరిలో భట్టి విక్రమార్కకు - రెవెన్యూ శాఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి - హోం శాఖ, శ్రీధర్‌బాబు - ఆర్థిక శాఖ, తుమ్మల నాగేశ్వరరావు - రోడ్లు భవనాల శాఖ, జూపల్లి కృష్ణారావు - పౌరసరఫరాల శాఖ, దామోదర రాజనర్సింహ - ఆరోగ్య శాఖ, పొన్నం ప్రభాకర్ - బీసీ సంక్షేమ శాఖ, సీతక్క - గిరిజన సంక్షేమ శాఖ, కొండా సురేఖ - స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి - పురపాలక శాఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - నీటిపారుదల శాఖను కేటాయించారు.
03.58
సాయంత్రం 4.45 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరిన వేళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ భేటీ జరగనుంది. సాయంత్రం 4.45 గంటలకు మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆరు గ్యారెంటీల హామీల అమలుపై చర్చించనున్నారు.
03.30
సీఎం రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హరిశ్‌రావు ట్విటర్(ఎక్స్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన భట్టి విక్రమార్కకు, మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ అభినందనలు తెలిపారు. హామీల అమలు దిశగా ప్రభుత్వం పనిచేయాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
03.25
కాసేపట్లో సచివాలయానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి తొలిసారిగా సచివాలయానికి వెళ్లనున్నారు. సచివాలయం వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు.
02:06 PM
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ఆషామాషీగా ఏర్పడిన రాష్ట్రం కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు.
01:56 PM
రెండు దస్త్రాలపై సంతకం చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
రెండు దస్త్రాలపై సీఎం రేవంత్‌రెడ్డి సంతకం చేయనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కొత్త సర్కార్ కొలువుదీరింది.
01:46 PM
మంత్రులతో ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళిసై
మంత్రిగా పొన్నం ప్రభాకర్ ప్రమాణస్వీకారం చేశారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కొండా సురేఖ ప్రమాణం చేశారు. మంత్రిగా సీతక్క ప్రమాణస్వీకారం చేశారు. మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ప్రమాణం చేశారు. రాష్ట్ర మంత్రిగా జూపల్లి కృష్ణారావు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై మంత్రులతో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, డి.కె.శివకుమార్, సిద్ధరామయ్య తదితరులు హాజరయ్యారు.
01:36 PM
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేశారు. మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. మంత్రిగా దామోదర రాజనర్సింహ ప్రమాణస్వీకారం చేశారు. మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. మంత్రిగా దూద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రమాణస్వీకారం చేశారు. మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.
01:22 PM
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రిగా సీఎల్పీ నేత, అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రేవంత్ రెడ్డి చేత ప్రమాణస్వీకారం చేయించారు.
01:13 PM
ప్రత్యేక వాహనంలో స్టేడియానికి వచ్చిన సోనియా, రేవంత్
ప్రత్యేక వాహనంలో ఎల్బీ స్టేడియానికి సోనియా, రేవంత్ వచ్చారు. ఎల్బీ స్టేడియానికి రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ చేరుకున్నారు. అలాగే ఎల్బీ స్టేడియం గవర్నర్ తమిళిసై చేరుకున్నారు.
01:09 PM
ఎల్బీ స్టేడియం వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్ - నడుచుకుంటూ స్టేడియానికి వస్తున్న డి.కె.శివకుమార్, పలువురు ముఖ్య నేతలు
ఎల్బీ స్టేడియం వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది. దీంతో డి.కె.శివకుమార్, పలువురు ముఖ్య నేతలు నడుచుకుంటూ స్టేడియానికి వస్తున్నారు.
01:04 PM
సీఎం, మంత్రులతో ప్రమాణం చేయించనున్న గవర్నర్
కాసేపట్లో సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎంతో పాటు మంత్రులు ప్రమాణం చేయనున్నారు. సీఎం, మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు.
12:59 PM
రాజ్‌భవన్ నుంచి బయల్దేరిన గవర్నర్ తమిళిసై
రాజ్‌భవన్ నుంచి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బయలుదేరారు. కాసేపట్లో ఎల్బీ స్టేడియానికి గవర్నర్ తమిళిసై రానున్నారు.
12:47 PM
తాజ్‌కృష్ణ నుంచి బయల్దేరిన సోనియా, ప్రియాంక, రాహుల్
తాజ్‌కృష్ణ నుంచి సోనియా, ప్రియాంక, రాహుల్ బయలుదేరారు. కాసేపట్లో ఎల్బీ స్టేడియానికి సోనియా, ప్రియాంక, రాహుల్ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డి సీఎం ప్రమాణస్వీకారంలో పాల్గొననున్నారు.
12:37 PM
అసెంబ్లీ స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్
అసెంబ్లీ స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ కాంగ్రెస్ నియమించింది.
12:34 PM
ఎల్బీ స్టేడియానికి చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
ఎల్బీ స్టేడియానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు.
12:03 PM
ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న భట్టి విక్రమార్క
ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం 1.04 గంటలకు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకార
11:18 PM
గచ్చిబౌలి ఎల్లా హోటల్ నుంచి బయలుదేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
గచ్చిబౌలి ఎల్లా హోటల్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బయలుదేరారు. రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్యేలు బస్సుల్లో బయలుదేరారు.
11:16 PM
ప్రగతిభవన్ ముందున్న బ్యారికేడ్లు తొలగిస్తున్న అధికారులు
ప్రగతిభవన్ ముందున్న బ్యారికేడ్లు అధికారులు తొలగిస్తున్నారు. జేసీబీతో బ్యారికేడ్లు తొలగిస్తున్నారు.
11:10 PM
శంషాబాద్ చేరుకున్న ఖర్గే, హిమాచల్ సీఎం సుఖ్విందర్
ఖర్గే, హిమాచల్ సీఎం సుఖ్విందర్ శంషాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద ఖర్గే, సుఖ్విందర్‌కు రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు.
11:06 PM
సీఎంతో పాటు ప్రమాణస్వీకారం చేయనున్న మంత్రులు వీరే
సీఎంతో పాటు భట్టి, ఉత్తమ్, సీతక్క, శ్రీధర్‌బాబు, పొంగులేటి, దామోదర రాజనరసింహ, సుదర్శన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల, జూపల్లి కృష్ణారావు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంత్రుల జాబితాలో ఉన్నవారికి రేవంత్ రెడ్డి ఫోన్లు చేస్తున్నారు.
10:35 PM
గచ్చిబౌలి ఎల్లా హోటల్‌లో దాదాపు 50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
గచ్చిబౌలి ఎల్లా హోటల్‌లో దాదాపు 50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్యేలు బస్సుల్లో బయలుదేరనున్నారు. ఉదయం 11 గంటలకు హోటల్ నుంచి బయలుదేరనున్నారు. ఇప్పటికే పోలీసులు వారికి నాలుగు బస్సులను ఏర్పాటు చేశారు.
10:32 PM
ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు
ఎల్బీస్టేడియంలో ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఎల్బీ స్టేడియం లోపల ఏర్పాట్లను సీఎస్ శాంతి కుమారి పరిశీలించారు. అలాగే ఏర్పాట్లను డీజీపీ రవిగుప్తా, సీపీ సందీప్ శాండిల్య పరిశీలించారు.
10:28 PM
ప్రమాణస్వీకారానికి ముందు కుటుంబసభ్యులతో కలిసి, పెద్దమ్మతల్లిని దర్శించుకోనున్న రేవంత్
రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ప్రమాణస్వీకారానికి ముందు జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిని దర్శించుకోనున్నారు. అనంతరం రేవంత్ పెద్దమ్మ గుడి నుంచి నేరుగా ఎల్బీస్టేడియానికి రానున్నారు. ఎల్బీస్టేడియంలో సీఎంగా ప్రమాణస్వీకారం రేవంత్‌రెడ్డి చేయనున్నారు.
10:10 PM
కాసేపట్లో తాజ్‌కృష్ణా హోటల్‌కు సోనియా, రాహుల్, ప్రియాంక
కాసేపట్లో తాజ్‌కృష్ణా హోటల్‌కు సోనియా, రాహుల్, ప్రియాంక చేరుకోనున్నారు. ఇప్పటికే తాజ్‌కృష్ణాకు వీహెచ్, వంశీకృష్ణ, ఇతర నేతలు చేరుకున్నారు.
09:59 PM
సీఎంతో పాటు ప్రమాణస్వీకారం చేయనున్న మంత్రులు వీరే
సీఎంతో పాటు భట్టి, ఉత్తమ్, సీతక్క, శ్రీధర్‌బాబు, పొంగులేటి, దామోదర రాజనరసింహ, సుదర్శన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల, జూపల్లి కృష్ణారావు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంత్రుల జాబితాలో ఉన్నవారికి రేవంత్ రెడ్డి ఫోన్లు చేస్తున్నారు.
09:40 PM
శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక - స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి
శంషాబాద్ విమానాశ్రయానికి సోనియా, రాహుల్, ప్రియాంక చేరుకున్నారు. అగ్రనేతలకు రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. రేవంత్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సోనియా, రాహుల్, ప్రియాంక వచ్చారు.
09:29 PM
శంషాబాద్ విమానాశ్రయం వద్దకు చేరుకున్న రేవంత్
రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం వద్దకు చేరుకున్నారు.
09:19 PM
జూబ్లీహిల్స్ నుంచి శంషాబాద్ బయల్దేరిన రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి శంషాబాద్ బయలుదేరారు. కాసేపట్లో సోనియా, రాహుల్, ప్రియాంక శంషాబాద్ రానున్నారు. సోనియా, రాహుల్, ప్రియాంకకు స్వాగతం పలకనున్నారు.
08:42 PM
రేవంత్ రెడ్డి నివాసానికి వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ
రేవంత్ రెడ్డి నివాసానికి వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ చేరుకున్నారు.
08:34 PM
కాసేపట్లో జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి సీఎస్ శాంతి కుమారి
కాసేపట్లో జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి సీఎస్ శాంతి కుమారి చేరుకోనున్నారు. ఇప్పటికే రేవంత్‌ని అసెంబ్లీ కార్యదర్శి నరసింహ చారి కలిసి వెళ్లారు.
07:50 PM
హైదరాబాద్‌కు చేరుకుంటున్న కాంగ్రెస్ అగ్రనేతలు
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉదయం 9.30 గంటలకు శంషాబాద్ చేరుకోనున్నారు. అలాగే ఉదయం 10.30 గంటలకు శంషాబాద్ హిమాచల్ సీఎం రానున్నారు. మల్లికార్జున ఖర్గే ఉదయం 10.45 గంటలకు శంషాబాద్ చేరుకోనున్నారు.
07:47 PM
జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసం వద్ద పోలీసుల బందోబస్తు
జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసం వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. రేవంత్ నివాసం వద్ద అధికారు కాన్వాయ్ సిద్ధం చేశారు.
07:45 PM
రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకానున్న సిద్ధరామయ్య
రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమానికి సిద్ధరామయ్య హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
07:28 PM
నేడు ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం
నేడు ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారు.హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేవంత్‌తో పాటు కొద్దిమంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ తర్వాత ఉంటుందని ఏఐసీసీ స్పష్టం చేసింది. రేవంత్ ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు తరలిరానున్నారు.
రేవంత్ ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్, ప్రియాంక రానున్నారు. అలాగే ప్రమాణస్వీకారానికి ఖర్గే, కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ ఎంపీలు రానున్నారు. ప్రమాణస్వీకారానికి రావాలని ఇండియా కూటమి నేతలకు ఆహ్వానం పంపించారు. రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారానికి డి.రాజా హాజరుకానున్నారు. ప్రమాణస్వీకారానికి పలు రాష్ట్రాల సీఎంలను కాంగ్రెస్ ఆహ్వానించింది. మమతా బెనర్జీ, నీతీశ్‌కుమార్, సిద్ధరామయ్య, స్టాలిన్, హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్, జేఎంఎం నేత శిబూ సోరెన్‌కు కాంగ్రెస్ ఆహ్వానం ఇచ్చింది.
07:20 PM
సీఎం ప్రమాణస్వీకారానికి 300 మంది అమరవీరుల కుటుంబాలకు, 250 మంది తెలంగాణ ఉద్యమకారులకు ఆహ్వానం
రేవంత్ ప్రమాణస్వీకారానికి పీసీసీ చీఫ్‌లకు కాంగ్రెస్ ఆహ్వానం ఇచ్చింది. రేవంత్ ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్యేలందరికీ పీసీసీ ఆహ్వానం పంపింది. రేవంత్ ప్రమాణస్వీకారానికి రావాలని డీసీసీ అధ్యక్షులందరికీ ఆహ్వానించింది. సీఎం ప్రమాణస్వీకారానికి 300 మంది అమరవీరుల కుటుంబాలకు, మరో 250 మంది తెలంగాణ ఉద్యమకారులకు పీసీసీ ఆహ్వానం పంపింది. రేవంత్ ప్రమాణస్వీకారానికి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కాంగ్రెస్ ఆహ్వానం ఇచ్చింది.
07:12 PM
రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాసిన రేవంత్‌రెడ్డి
రాష్ట్ర ప్రజలకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తన ప్రమాణస్వీకారానికి రావాలని ప్రజలను కారారు. ప్రజాప్రభుత్వ ప్రమాణస్వీకారానికి ప్రజలందరికీ ఆహ్వానం ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందన్నారు.
07:08 PM
ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఆంక్షలు అమలో ఉండనున్నాయి. పబ్లిక్‌గార్డెన్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలు నాంపల్లి వైపు, ఎస్‌బీఐ గన్‌పౌండ్రి నుంచి వచ్చే వాహనాలు చాపెల్ రోడ్డు వైపు, బషీర్‌బాగ్ నుంచి ఎల్బీ స్డేడియం వైపు వచ్చే వాహనాలు కింగ్ కోఠి వైపు, ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లించారు. నగరవాసులు ప్రత్యామ్నాయదారులు ఎంచుకోవాలని పోలీసుల సూచించారు. ఇబ్బందులుంటే 9010203626 నంబర్‌కు ఫోన్ చేయాలని చెబుతున్నారు.
07:04 PM
ఎల్బీ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశాం: డీజీపీ
ఎల్బీ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశామని డీజీపీ గుప్తా వెల్లడించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించమన్నారు. దాదాపు లక్ష మంది సభకు హాజరు కావచ్చని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని అన్నారు. ఎల్బీ స్టేడియంలో 30 వేల మందికి పైగా కూర్చునే సౌకర్యం ఉందని తెలిపారు. మిగతా జనం కోసం స్టేడియం బయట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసినట్లు డీజీపీ వివరించారు.