ETV Bharat / bharat

ఇండియన్ ఆర్మీలో ఛాన్స్ మిస్​.. ఉక్రెయిన్​ సేనలో చేరి 'సైనికేశ్​' ఫైట్

author img

By

Published : Mar 8, 2022, 1:36 PM IST

Tamil Nadu Youth Joins Ukrainian Army: భారత సైన్యంలో చేరాలన్నది అతడి కల. రెండు సార్లు విఫలయత్నం చేశాడు. అంతటితో ఆగిపోలేదు. అమెరికా సైన్యంలో చేరేందుకు వివరాలు సేకరించాడు. అదీ సాధ్యం కాలేదు. కానీ, ఇప్పుడు ఉక్రెయిన్​ సైన్యంలో చేరి రష్యాపై పోరాటం చేస్తూ తన కలను నెరవేర్చుకున్నాడు. అతనే.. తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల సైనికేశ్​.

Tamil Nadu Youth Sainikhesh Ravichandran
ఉక్రెయిన్​ సైన్యంలోకి తమిళనాడు యువకుడు

Tamil Nadu Youth Joins Ukrainian Army: భారత సైన్యంలో చేరేందుకు రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. కానీ, ఇప్పుడు ఉక్రెయిన్​ తరఫున ఆ దేశ సైన్యంలో చేరి రష్యాతో పోరాటం చేస్తున్నాడు. అతనే తమిళనాడు, కోయంబత్తూర్​కు చెందిన 21ఏళ్ల సైనికేశ్​ రవిచంద్రన్​. తుడలియుర్​కు చెందిన సైనికేశ్​ రవిచంద్రన్​.. ఉక్రెయిన్​లోని ఖార్కివ్​ నేషనల్​ వర్సిటీలో ఎయిరోస్పేస్​ ఇంజినీరింగ్​ విద్యార్థి. ప్రస్తుతం అతను ఉక్రెయిన్​ ఆర్మీలో చేరినట్లు నిఘా విభాగాల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలిసింది.

ఉక్రెయిన్​ సైన్యంలో చేరిన క్రమంలో సైనికేశ్​ ఇంటిని కొద్ది రోజుల క్రితం కేంద్ర నిఘా విభాగం అధికారులు సందర్శించారు. అతని గురించి, ఉక్రెయిన్​ సైన్యంలో చేరేందుకు గల కారణాలను తెలుసుకున్నట్లు తమిళనాడు పోలీసులు తెలిపారు. సైనికేశ్​కు.. ఆర్మీలో చేరాలని, ట్రైనింగ్​లో పాల్గొనాలనేది కల అని అతని తల్లిదండ్రులు అధికారులకు తెలిపారు. అతని గదిలో భారత సైన్యం, అధికారుల చిత్రాలు అంటించి ఉండటాన్ని చూపించారు.

అమెరికా సైన్యం వివరాల సేకరణ..

అమెరికా సైన్యంలో చేరాలని చెన్నైలోని అగ్రరాజ్య కాన్సులేట్​లోనూ వివరాలు సేకరించినట్లు సైనికేశ్​ కుటుంబ సభ్యులు చెప్పటం గమనార్హం. అయితే, అది సాధ్యం కాదని తెలుసుకున్న సైనికేశ్ విరమించుకున్నాడు​. ఐదేళ్ల ఎయిరోస్పేస్​ ఇంజినీరింగ్​ చేసేందుకు ఉక్రెయిన్​ వెళ్లాడు. తనకు వీడియో గేమింగ్​ సంస్థలో ఉద్యోగం లభించిందని ఇటీవలే కుటుంబ సభ్యులకు తెలిపాడు సైనికేశ్​. కానీ, అతను ఉక్రెయిన్ సైన్యంలో చేరినట్లు అధికారులు ఇంటికి వచ్చాకే కుటుంబ సభ్యులకు తెలిసింది.

ఈ విషయం తెలిసి ఆందోళనకు గురయ్యానని, తన కుమారుడిని స్వదేశానికి తీసుకురావాలని సైనికేశ్​ తండ్రి రవిచంద్రన్​ కోరారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఇంటికి రావాలనుకోవట్లేదని కొద్ది రోజుల క్రితమే చెప్పాడని ఆవేదన వ్యక్తం చేశారు​.

ప్రస్తుతం వలంటీర్లు ఉన్న జార్జియన్​ నేషనల్​ లిజియన్​ పారామిలటరీ యూనిట్​లో సైనికేశ్ చేరి యుద్ధ భూమిలో పోరాటం చేస్తున్నట్లు తెలిసింది.

ఇదీ చూడండి:నీరే అగ్గి రాజేసింది.. ఉక్రెయిన్‌తో రష్యా వివాదానికి కారణం ఇదేనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.