SSC Police Constable Jobs : పోలీసు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) దిల్లీ పోలీసు విభాగంలోని 7547 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతీయ పౌరులందరూ ఈ పోస్టులకు అర్హులు. ( Delhi Police Constable Recruitment 2023 ) ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కానిస్టేబుల్ (పురుషులు) పోస్టుల వివరాలు
- జనరల్ - 3053
- ఈడబ్ల్యూఎస్ - 542
- ఓబీసీ - 287
- ఎస్సీ - 872
- ఎస్టీ - 302
- మొత్తం పోస్టులు - 5,056
కానిస్టేబుల్ (మహిళలు) పోస్టుల వివరాలు
- జనరల్ - 1502
- ఈడబ్ల్యూఎస్ - 268
- ఓబీసీ - 142
- ఎస్సీ - 429
- ఎస్టీ - 150
- మొత్తం పోస్టులు - 2491
విద్యార్హతలు
Delhi Police Constable Qualifications : అభ్యర్థులు 10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కచ్చితంగా వ్యాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్ (LMV) కలిగి ఉండాలి. లెర్నర్ లైసెన్స్‌ను మాత్రం ఆమోదించరు.
వయోపరిమితి
Delhi Police Constable Age Limit : 2023 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి.
శారీరక ప్రమాణాలు
Delhi Police Constable Measurements :
- పురుషుల ఎత్తు 170 సెం.మీ., ఛాతీ 81 సెం.మీ ఉండాలి.
- మహిళల ఎత్తు 157 సెం.మీ ఉండాలి.
దరఖాస్తు రుసుము
Delhi Police Constable Fee : జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌కు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
జీతభత్యాలు
Delhi Police Constable Salary : కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు (పే లెవల్- 3) రూ.21,700 - రూ.69,100 వరకు జీతం అందిస్తారు.
ఎంపిక విధానం
Delhi Police Constable Selection Process : అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ) నిర్వహిస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష
Delhi Police Constable Exam Pattern : కానిస్టేబుల్ పరీక్షలో 100 ప్రశ్నలు - 100 మార్కులకు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ ఆఫైర్స్, రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీ, కంప్యూటర్ ఫండమెంటల్స్ తదితర అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్ష వ్యవధి కేవలం 90 నిమిషాలు.
తెలుగు రాష్టాల్లోని పరీక్ష కేంద్రాలు
Delhi Police Constable Exam Centers :
- ఆంధ్రప్రదేశ్ : చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం
- తెలంగాణ : హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
దరఖాస్తు విధానం
Delhi Police Constable Online Apply : ఆసక్తి గల అభ్యర్థులు https://delhipolice.gov.in/ లేదా https://ssc.nic.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు
Delhi Police Constable Important Dates :
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ : 2023 సెప్టెంబర్ 1
- ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 సెప్టెంబర్ 30
- దరఖాస్తు సవరణ తేదీలు : 2023 అక్టోబర్ 3, 4 తేదీలు
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష : 2023 డిసెంబర్లో పరీక్ష జరిగే అవకాశం ఉంది.