ETV Bharat / bharat

స్పేస్​లోకి చీమలు, రొయ్యలు, ఐస్​క్రీమ్.. ఎందుకంటే?

ఐస్​క్రీమ్, అవకాడోలు, నిమ్మకాయలు... ఏంటి? ఇదేమైనా గ్రోసరీ లిస్ట్ అనుకుంటున్నారా? కాదండోయ్! అంతరిక్షంలోకి నాసా పంపిన వస్తువుల జాబితా. ఇవే కాదు చీమలను కూడా పంపించింది. స్పేస్ఎక్స్(spacex launch) వ్యోమనౌక వీటిని నింగిలోకి చేర్చింది. అసలు ఇవి అంతరిక్షంలోకి ఎందుకు పంపించారంటే?

SPACEX NASA
స్పేస్​ఎక్స్ ప్రయోగం
author img

By

Published : Aug 29, 2021, 3:37 PM IST

అంతరిక్షంలోకి చీమలను పంపించింది నాసా. స్పేస్ఎక్స్ సంస్థ.. వీటిని(spacex launch) తన వ్యోమనౌక ద్వారా ప్రయోగించింది. మంగళవారం ఇవి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(International Space Station)కి చేరుకోనున్నాయి. చీమలతో పాటు అవకాడోలు, మనిషి అంత ఎత్తైన రోబో చెయ్యిని స్పేస్ స్టేషన్​కు స్పేస్ఎక్స్ పంపింది.

నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం నిర్వహించింది స్పేస్ఎక్స్. ఫాల్కన్ రాకెట్ ద్వారా డ్రాగన్ క్యాప్సూల్​(dragon spacex)ను నింగిలోకి ప్రవేశపెట్టింది. 4,800 పౌండ్ల బరువైన పరికరాలు, ఇతర సామగ్రిని దీని ద్వారా పంపించారు. స్పేస్​స్టేషన్​లో ఉన్న ఏడుగురు వ్యోమగాముల కోసం నిమ్మకాయలు, ఐస్​క్రీమ్​లను సైతం పంపించారు.

చీమలు ఎందుకు?

అమెరికాకు చెందిన 'గర్ల్స్​ స్కౌట్స్'.. నాసా ద్వారా ఈ చీమలను అంతరిక్షంలోకి పంపింది. స్పేస్​లో వీటిపై ప్రయోగాలు నిర్వహించనుంది. ఉప్పునీటి రొయ్యలు, కొన్ని మొక్కలను సైతం ప్రయోగాల కోసం పంపించింది. విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పంపిన విత్తనాలను సైతం డ్రాగన్ క్యాప్సూల్ మోసుకెళ్లింది. కాంక్రీట్, సోలార్ సెల్స్, తదితర మెటీరియల్​ సైతం ఈ ప్రయోగంలో అంతరిక్షంలోకి బయల్దేరింది.

రోబో చెయ్యి పనేంటంటే...

గిటాయ్ ఇంక్ అనే జపాన్ స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసిన రోబోటిక్ చెయ్యిని.. అంతరిక్ష కేంద్రంలో వివిధ పరికరాల మరమ్మతుల కోసం వినియోగించనున్నారు. వ్యోమగాములు చేసే ఇతర పనులు కూడా ఇది చేస్తుందని సంస్థ అధికారి టొయోటకా కొజుకి తెలిపారు. ఇలాంటి పరికరాలను మరికొన్ని పంపించనున్నట్లు చెప్పారు. 2025 నాటికి చంద్రుడిపై స్థావరాలు ఏర్పాటు చేసేందుకు ఈ పరికరాలను వినియోగించనున్నట్లు తెలిపారు. చంద్రుడి గర్భంలో ఉన్న విలువైన వనరులను తవ్వి తీసేందుకూ ఈ రోబో పరికరాలను ఉపయోగించే ప్రణాళికలు వేసుకున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి: అంతరిక్షం అంచుకు వెళ్లాలా? ఎంత ఖర్చవుతుందంటే..

స్పేస్ స్టేషన్​కు సరకులు పంపేందుకు నాసా ప్రైవేటు సేవలను వినియోగించుకుంటోంది. ముఖ్యంగా స్పేస్ఎక్స్ సంస్థ(spacex nasa contract) ద్వారా.. కావాల్సిన పరికరాలను నింగిలోకి పంపిస్తోంది. నాసా కోసం స్పేస్ఎక్స్ చేపట్టిన తాజా ప్రయోగం 23వది కావడం విశేషం.

ఇదీ చదవండి: అంతరిక్షంలోకి 'బాహుబలి' ఎలుకలు, పురుగులు, క్రిస్మస్​ గిఫ్టులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.