ETV Bharat / bharat

సోనూసూద్ పెద్ద మనసు.. వెన్నుముక వ్యాధితో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి హామీ - సోనూసూద్​ సాయం

కరోనా సమయంలో ఎంతో మందికి ఆపన్నహస్తం అందించిన సోనూసూద్..​ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన వెన్నుముక కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి వైద్యానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

sonu-sood-came-forward-for-child-suffering-from-rare-disease-spine-muscular-atrophy-disease-in-mp

author img

By

Published : Dec 24, 2022, 12:31 PM IST

సినీస్టార్ సోనూసూద్ ​మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహకాళేశ్వర ఆలయంలో సోనూసూద్​ తన భార్య సోనాలితో కలిసి శుక్రవారం.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే సమయంలో ఓ కుటుంబం సోనూసూద్​ దగ్గరకు వచ్చింది. వెన్నముక కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్న తమ కుమారుడిని రక్షించాలని సోనూను వేడుకుంది.

దీంతో పిల్లాడి వైద్య చికిత్సకు సాధ్యమైనంత సహాయాన్ని అందిస్తానని వారికి సోనూ హామీ ఇచ్చారు. బిడ్డ చికిత్స కోసం వీలైనంత ఎక్కువ విరాళం ఇవ్వాలని సోనూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చిన్నారి చికిత్స కోసం ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు అవుతుందని పిల్లాడి తల్లి సోనూకు తెలిపింది. అయితే తన కుమారుడి వైద్య సహాయం కోసం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్​, మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్‌కు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని అథర్వ్​ తండ్రి తెలిపాడు.

కరోనా సమయంలో ఎంతో మందికి ఆపన్నహస్తం అందించిన సోనూసూద్.. ఇప్పటికీ అనేక మందికి పలు విధాలుగా సహాయం చేస్తున్నారు. ఇటీవలే ప్రముఖ సారంగి వాద్య కళాకారుడికి వైద్యం సహాయం చేస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి వార్త ఇక్కడ క్లిక్​ చేయండి.
దీంతో పాటు ఆయన చేసిన మరిన్ని సహాయ కార్యక్రమాల వార్తలు మీకోసం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.