ETV Bharat / bharat

600 మొబైల్​ ​టవర్లు చోరీ.. తీగ లాగితే కదిలిన డొంక.. సంస్థ ఉద్యోగి పనేనా? - తమిళనాడు

చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన ఒక సెల్​ఫోన్ టవర్​ కనిపించడంలేదని పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేయగా.. దర్యాప్తులో మొత్తం 600 సెల్​ టవర్లు దొంగతనానికి గురయ్యాయని గుర్తించారు పోలీసులు.

cell phone tower missing in tamilnadu
gtl infra cell tower news
author img

By

Published : Jun 22, 2022, 10:47 PM IST

తమిళనాడు రాజధాని చెన్నైలో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈరోడ్​లోని చెన్నిమలై హిల్స్​లో ఉన్న జీటీఎల్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ అనే ప్రైవేట్ సంస్థకు చెందిన ఓ సెల్​ టవర్ పోయిందని పోలీసు స్టేషన్​లో కేసు నమోదైంది. ఆ టవర్​ 2017 నుంచి ఉపయోగంలో లేదు. దానిపై ఎలాంటి పర్యవేక్షణ లేదు. ఈ అపహరణ కారణంగా సంస్థకు రూ.32 లక్షల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. షాకింగ్​ విషయాలు వెలుగులోకి తెచ్చారు. ఆ సంస్థకు చెందిన మొత్తం 600 సెల్ టవర్లు అపహరణకు గురైనట్లు గుర్తించారు.

ముంబయికి చెందిన జీటీఎల్ సంస్థ.. కేవలం తమిళనాడులోనే 6 వేలకుపైగా సెల్​ టవర్లను ఏర్పాటు చేసి నిర్వహిస్తోంది. అయితే 2018లో నెట్​వర్కింగ్​ సేవలనూ అందించే ఓ ప్రైవేటు షిప్పింగ్​ సంస్థ.. ఆ సేవలను నిలిపివేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఆ సంస్థ కోసం ఏర్పాటు చేసిన సెల్ టవర్లు పనిచేయడం ఆగిపోయింది. కరోనా సమయంలో వాటి నిర్వహణ, పర్యవేక్షణ జరగలేదు.

కరోనా కాలాన్ని వినియోగించుకొని, పర్యవేక్షణ కొరవడిన తమ సెల్​టవర్లను ఒక గ్యాంగ్​ లక్ష్యంగా చేసుకొని అపహరిస్తోందని జీటీఎల్ ఆరోపిస్తోంది. "ఒక సెల్ టవర్ ఏర్పాటు చేయడానికి రూ.25లక్షల నుంచి రూ.40 లక్షలు ఖర్చవుతుంది. మా సంస్థకు చెందిన ఒక ఉద్యోగి, కొందరు దుండగులు కలిసి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారు" అని జీటీఎల్ సంస్థ ఆరోపించింది.

ఇదీ చూడండి: Viral Video: 11వేల వోల్టుల కరెంటు తీగ తాకి వ్యక్తి సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.