ETV Bharat / bharat

రైల్వేస్టేషన్​ను తలపించిన ఎయిర్​పోర్ట్​- కేంద్రమంత్రి చర్యలు - ఒమిక్రాన్ భయాలు

Delhi Airport crowd: దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతోంది. ఒమిక్రాన్​ భయాల మధ్య ప్రయాణికులు కనీస నిబంధనలైన మాస్క్​లు, భౌతిక దూరం పాటించకపోవటం కలవరపెడుతోంది. ఈ నిబంధనలు ఒమిక్రాన్​ కట్టడికా? ఆహ్వానానికా? అన్నట్లుగా ఉంది. మరోవైపు.. రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఎయిర్​పోర్ట్​ అధికారులు తెలిపారు.

Delhi airport
కిక్కిరిసిన దిల్లీ ఎయిర్​పోర్ట్​
author img

By

Published : Dec 6, 2021, 10:43 PM IST

Delhi Airport crowd: ఓవైపు ఒమిక్రాన్​ భయాలతో మళ్లీ రక్షణ కవచాలవైపు చూస్తున్న తరుణంలో దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇసుక వేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. కరోనా కొత్త వేరియంట్​ నేపథ్యంలో విదేశీ ప్రయాణికులకు కఠిన నిబంధనలు తీసుకొచ్చింది కేంద్రం. దీంతో ఎయిర్​పోర్ట్​లో రద్దీ పెరుగుతోంది. దాని ఫలితంగా కొవిడ్​ నిబంధనలు గాలికొదిలేసే పరిస్థితులు తలెత్తుతున్నాయి.

Delhi airport
కిక్కిరిసిపోయిన దిల్లీ ఎయిర్​పోర్ట్​

గంటల తరబడి అక్కడే..

విదేశాల నుంచి ముఖ్యంగా ఒమిక్రాన్​ ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు తప్పనిసరి చేసింది కేంద్రం. దీంతో పరీక్షలు చేయించుకుని ఫలితం వచ్చే వరకు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. దిల్లీ ఎయిర్​పోర్ట్​లో రెండు రకాల పరీక్షలు చేస్తున్నారు. ఒకటి.. సాధారణ ఆర్​టీపీసీఆర్​ పరీక్ష. దీనికి రూ.500 వసూలు చేస్తుండగా.. ఈ పరీక్ష ఫలితం కోసం 6-8 గంటలు ఎదురుచూడాల్సి వస్తోంది. రెండోది.. ర్యాపిడ్​ పీసీఆర్​ టెస్ట్​. దీనికి రూ.3,500 వసూలు చేస్తుండగా.. రెండు గంటల్లో ఫలితం వస్తుంది. ఆర్​టీపీసీఆర్​ ఫలితానికి సమయం ఎక్కువ పడుతున్న క్రమంలో ప్రయాణికులు ర్యాపిడ్ టెస్టులకే మొగ్గు చూపుతున్నారు. పరీక్ష ఫలితాల కోసం ఇమ్మిగ్రేషన్​ డెస్క్​ల వద్ద రద్దీ ఎక్కువగానే ఉంటోంది.

Delhi airport
దిల్లీ విమానాశ్రయంలో రద్దీ

దిల్లీ విమానాశ్రయంలోని పరిస్థితులను కొందరు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా వైరల్​గా మారాయి. కరోనా నిబంధనలు కాదు.. ఎయిర్​పోర్ట్​లే హాట్​స్పాట్​లుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Delhi airport
పరీక్షల కోసం వేచి ఉన్న ప్రయాణికులు

120 ర్యాపిడ్​ పీసీఆర్​ టెస్టింగ్​ యంత్రాల ఏర్పాటు

ఒమిక్రాన్​ వేరియంట్​ భయాలతో ఎట్​ రిస్క్​ దేశాల నుంచి భారత్​కు వస్తున్న ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ క్రమంలో రద్దీని తగ్గించేందుకు దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం పరీక్ష కేంద్రాల సామర్థ్యాన్ని పెంచింది. 20 కౌంటర్లతో పాటు 120 ర్యాపిడ్​ పీసీఆర్​ టెస్టింగ్​ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గంటకు 500-600 పరీక్షల సామర్థ్యం ఉంటుందని తెలిపారు అధికారులు. అలాగే గంటకు 500 ఆర్​టీపీసీఆర్​ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

'ఎట్​ రిస్క్​ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల స్క్రీనింగ్​, టెస్టింగ్​ సౌకర్యాలను ఎప్పటికప్పుడు పెంచుతున్నాం. ప్రతిరోజు కొవిడ్​ టెస్టు కోసం ముందే బుక్​ చేసుకుంటున్న ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. సాధారణ ఆర్​టీపీసీఆర్​తో పోలిస్తే ర్యాపిడ్​ పీసీఆర్​ కోసం చూస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని 120 ర్యాపిడ్​ పీసీఆర్​ టెస్ట్​ మిషన్స్​ని ఏర్పాటు చేశాం.' అని పేర్కొన్నారు డయల్​ సీఈఓ విదేశ్​ కుమార్​ జైపురియార్​.

Delhi airport
భారీగా ఉన్న క్యూ లైన్లు
Delhi airport
దిల్లీ విమానాశ్రయంలో కొవిడ్​ పరీక్షల కోసం వేచి ఉన్న ప్రయాణికులు

రద్దీపై సింధియా ఆదేశాలు..

విదేశీ ప్రయాణికులు గణనీయంగా పెరిగిన క్రమంలో సరైన రద్దీ నిర్వహణ వ్యూహాలను అనుసరించాలని దిల్లీ ఎయిర్​పోర్ట్​ ఆపరేటర్​ డయల్​ను ఆదేశించారు పౌర విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా. కొత్త మార్గదర్శకాల నేపథ్యంలో దిల్లీ ఎయిర్​పోర్ట్​లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ మేరకు ఆదేశించారు.

ఎయిర్​పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా, ఇమ్మిగ్రేషన్​, జీఎంఆర్​ నేతృత్వంలోని దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ (డయల్​) అధికారులతో సోమవారం సమావేశమయ్యారు కేంద్ర మంత్రి. ఈ సమావేశంలో జెనస్ట్రింగ్స్​ డయగ్నోస్టిక్స్​, సోల్​ లాబొరెటరీస్​ అధికారులు సైతం పాల్గొన్నారు.

ఇదీ చూడండి: Omicron in India: దేశంలో 24కు చేరిన ఒమిక్రాన్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.