School Teacher Dragged by Snatchers : యాపిల్ ఫోన్‌ను దొంగతనం చేసేందుకు ఇద్దరు బైకర్లు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ఫోన్ కోసం ఓ మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ దారుణ ఘటన దక్షిణ దిల్లీలో శుక్రవారం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
బాధితురాలు యొవికా చౌదరి (24) దక్షిణ దిల్లీలోని జ్ఞాన్ భారతి పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి ఆటోలో ఇంటికి వెళ్తున్నారు. ఆమె వద్ద ఉన్న ఐఫోన్‌ను గమనించిన దుండగులు దానిని కొట్టేసేందుకు ప్రణాళిక రచించారు. రెండు ద్విచక్రవాహనాలపై వచ్చిన వారు ఆటోలో వెళ్తోన్న యొవికా చౌదరి దగ్గర ఉన్న ఫోన్‌ను లాక్కోవాలని చూశారు. దీనికి యొవికా ప్రతిఘటించడం వల్ల జరిగిన పెనుగులాటలో ఆమె ఆటో నుంచి కిందపడిపోయింది.
అక్కడితో వదలని నిందితులు ఆ ఫోన్ కోసం యొవికా చౌదరి రోడ్డుపై అలాగే ఈడ్చుకెళ్లారు. వారితో పోరాడలేని ఆమె ఫోన్‌ను వదిలేయడం వల్ల వారు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో ఆమె ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం సాకేత్‌లోని మాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
యువకుడిని ఈడ్చుకెళ్లిన ముగ్గురు దుండగులు..
Three Bullies Dragged Young Man From Scooty : అంతకుముందు ఉత్తర్‌ప్రదేశ్ బరేలీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ యువకుడిని రోడ్డుపై దారుణంగా ఈడ్చుకెళ్లారు ముగ్గురు దుండగులు. స్కూటీపై వెళ్తూ అందరూ చూస్తుండగా యువకుడిని లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇదీ జరిగింది..
అందరూ చూస్తుండగానే.. ముగ్గురు దుండగులు స్కూటీపై వెళ్తూ ఓ యువకుడి చేయి పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్‌గా మారింది. అనంతరం పోలీసుల దృష్టికి వెళ్లడం వల్ల ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన బారాదారీ ప్రాంతంలోని సంజయ్ నగర్లో జరిగిందని ప్రాథమికంగా పోలీసులు అంచనా వేశారు. ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బస్సు ఢీకొని బైకర్ మృతి.. బైక్‌ను 12 కి.మీ లాక్కెళ్లిన డ్రైవర్.. ఆఖరికి..
డెలివరీ బాయ్‌ను ఢీకొట్టి 100మీ లాక్కెళ్లిన కారు డ్రైవర్.. అక్కడికక్కడే మృతి.. కి.మీ ఛేజ్ చేసి మరీ..