సీనియర్లు, జూనియర్ల మధ్య గొడవలు కామన్. కాసేపటికే వారు మళ్లీ కలిసిపోతుంటారు. కానీ, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో చిన్నపాటి గొడవగా మొదలై తీవ్ర వాగ్వాదంగా మారింది. ఈ ఘటనలో పదో తరగతి విద్యార్థి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బాధితుడ్నిమోహన్ సింగ్ రాజ్‌పుత్‌గా గుర్తించారు.
అసలేం జరిగిందంటే?.. రాయ్‌పుర్‌లోని ఖమత్రాయ్లో శివాజీనగర్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాధితుడు మోహన్ సింగ్ రాజ్‌పుత్.. స్నేహితులతో కలిసి గణిత పరీక్ష రాయడానికి వెళ్లాడు. పరీక్ష ముగిశాక బయటకు వస్తున్న సమయంలో మోహన్‌కు అతడి సీనియర్లకు చిన్న విషయంలో వాగ్వాదం జరిగింది. దీంతో కోపం పెంచుకున్న సీనియర్లు.. మోహన్‌ను చితకబాదారు. వెంటనే అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అక్కడే ఉన్న మిగతా విద్యార్థులు.. అంబులెన్స్‌లో మోహన్‌ను మెకహరా ఆసుపత్రికి తరలించినా.. లాభం లేకుండా పోయింది. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు నిర్థరించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. మెకహరా ఆసుపత్రికి వెళ్లారు. కేసు నమోదు చేసుకుని.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఓ మైనర్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న మిగిలిన విద్యార్థుల కోసం గాలిస్తున్నారు.
ఇవీ చదవండి: లీవ్ ఇవ్వలేదని జవాన్ సూసైడ్.. 18 గంటలు కుటుంబాన్ని బందీగా చేసుకొని!