ETV Bharat / bharat

సీబీఎస్​ఈ పరీక్షలపై ఆ ఆదేశాలు ఇవ్వలేం: సుప్రీం - సీఐఎస్​సీఈ

సీబీఎస్​ఈ, సీఐఎస్​సీఈ 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలను(cbse board exam 2021) ఆఫ్​లైన్​తో పాటు హైబ్రిడ్​ మోడ్​లోనూ జరిపేలా ఆదేశించలేమని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు(Supreme court). ఇప్పటికే పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో కలగజేసుకోవటం సరికాదని తెలిపింది.

board exams, CBSE
సీబీఎస్​ఈ, సుప్రీం
author img

By

Published : Nov 18, 2021, 1:04 PM IST

Updated : Nov 18, 2021, 1:13 PM IST

10వ, 12వ తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలకు(cbse board exam 2021) హాజరయ్యేందుకు హైబ్రిడ్​ మోడ్​ అవకాశం కల్పించేలా సీబీఎస్​ఈ, సీఐఎస్​సీఈలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్​ను తిరస్కరించింది సుప్రీం కోర్టు. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఇలాంటి పరిస్థితుల్లో కలగజేసుకుని, మొత్తం ప్రక్రియను చెడగొట్టటం సరికాదని తెలిపింది.

కరోనా మహమ్మారి(Corona virus) కొనసాగుతున్న క్రమంలో ఆఫ్​లైన్​లో(Online exams) మాత్రమే కాకుండా హైబ్రిడ్​ పద్ధతిలోనూ పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆరుగురు విద్యార్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్​పై విచారణ చేపట్టింది జస్టిస్​ ఏఎం ఖాన్విల్కర్​, జస్టిస్​ సీటీ రవికుమార్​ ధర్మాసనం. పరీక్షల సమయంలో ఎలాంటి సమస్య ఎదురవకుండా అన్ని జాగ్రత్తలు, చర్యలు తీసుకున్నారనే నమ్ముతున్నట్లు పేర్కొంది.

ఈ సందర్భంగా.. ఆఫ్​లైన్​ పద్ధతిలో బోర్డు పరీక్షలు నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు సీబీఎస్​ఈ(cbse board exam 2021) తరఫున హాజరైన సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా. పరీక్షా కేంద్రలను 6,500 నుంచి 15వేలకు పెంచామని వెల్లడించారు.

నవంబర్​ 16 నుంచే సీబీఎస్​ఈ బోర్డు పరీక్షలు ప్రారంభం కాగా, ఈనెల 22 నుంచి సీఐఎస్​సీఈ తొలి సెమిస్టర్​ బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

ఇదీ చూడండి: సీబీఎస్​ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్​ విడుదల

Last Updated : Nov 18, 2021, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.