ETV Bharat / bharat

'పాంచజన్య ఆర్​ఎస్​ఎస్ అధికార ప్రతినిధి కాదు' - ఐటీ పోర్టల్​పై పాంచజన్యంలో కథనం

ఆదాయపన్ను శాఖ రూపొందించిన పోర్టల్​లో సాంకేతిక లోపాలను ప్రస్తావిస్తు ప్రచురించిన కథనంపై ఆర్​ఎస్​ఎస్​ వెనక్కి తగ్గింది. ఈ కథనం అనేది కేవలం రచయిత భావాన్ని వ్యక్తపరుస్తుందని ఆర్​ఎస్​ఎస్​ అఖిల భారత ప్రచారకర్త సునీల్​ అంబేకర్​ తెలిపారు.

Panchjanya article
పాంచజన్య పత్రిక
author img

By

Published : Sep 6, 2021, 8:36 AM IST

భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్​ రూపొందించిన ఐటీ, జీఎస్​టీ పోర్టల్స్​లో తలెత్తిన పలు సాంకేతిక లోపాలను ప్రస్తావిస్తూ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్​ (ఆర్​ఎస్​ఎస్​) అనుబంధ పత్రిక పాంచజన్య చేసిన వ్యాఖ్యలపై ఆర్​ఎస్​ఎస్​ నాయకులు కొంతమేరకు వెనక్కి తగ్గారు.

ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత ప్రచారకర్త సునీల్ అంబేకర్ దీనిపై స్పందించారు. పాంచజన్య అనేది ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధి కాదని ఆయన అన్నారు. ఇందులో రచయిత తన భావాన్ని వ్యక్తపరుస్తూ రాశారని తెలిపారు. అది కేవలం ఆయన వ్యక్తిగతం మాత్రమేనని చెప్పుకొచ్చారు. దీనిని సంస్థతో ముడిపెట్టకూడదని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు.

ఇన్ఫోసిస్​ విదేశీ శక్తులతో జట్టు కట్టిందని అందుకే.. ఐటీ పోర్టల్​లో సమస్యలు తరుచూ వెలుగు చూస్తున్నట్లు పాంచజన్యలో ఓ కథనం ప్రచురించింది. అయితే దీన్ని కేవలం రచయిత కోణం నుంచి మాత్రమే చూడాలని వివరణ ఇచ్చింది ఆర్​ఎస్​ఎస్​.

ఇదీ చూడండి: టీచర్స్​ డే రోజే ప్రధానోపాధ్యాయుడిపై కేసు.. కారణమేంటి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.