ETV Bharat / bharat

ఆరేళ్ల చిన్నారిపై టీచర్ అఘాయిత్యం! - రాజస్థాన్ అత్యాచార బాధితురాలు

ఆరేళ్ల చిన్నారిపై విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మాస్టారు అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్​లో వెలుగుచూసింది. మరో ఘటనలో ఐదేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం.. తన తల్లి స్నానం చేయిస్తుండగా వెలుగు చూసింది. ఈ ఉదంతంలో పక్కింటి వ్యక్తే నిందితుడని పోలీసులు గుర్తించారు.

rape
రేప్
author img

By

Published : Nov 16, 2021, 12:35 PM IST

రాజస్థాన్‌లోని కోటాలో ఆరేళ్ల బాలికపై ప్రైవేట్ టీచర్​ అత్యాచారానికి పాల్పడ్డాడు. కొట్సువా గ్రామంలో వెలుగుచూసిన ఈ దారుణ ఘటనలో నిందితుడు అబ్దుల్ రహీమ్​పై(43) పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు పోలీసులు.

ఇదీ జరిగింది..

'కోటలోని రాంపురానికి చెందిన రహీమ్.. గ్రామంలోని పిల్లలకు ఉర్దూలో ప్రైవేట్ ట్యూషన్ చెబుతుంటాడు. ప్రస్తుతం స్థానిక మదర్సాలో ఉంటున్నాడు' అని పోలీసులు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు వివరించారు.

శనివారం మధ్యాహ్నం విద్యార్థులందరినీ పంపేసిన రహీమ్.. బాధితురాలిని మదర్సాకు తిరిగి రావాలని చెప్పాడు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు వివరించింది. దీనిపై ఆదివారం అర్ధరాత్రి డిగోడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

'నాన్న.. ఓ డర్టీ మ్యాన్..'

రెండేళ్ల కన్న కూతురిపై అత్యాచారం చేసిన ఓ వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది మధ్యప్రదేశ్​లోని ఇందోర్ కోర్టు. విచారణ సందర్భంగా తమ తండ్రి 'మంచివాడు కాదు'(డర్టీ మ్యాన్) అని చిన్నారి పేర్కొంది.

ఈ ఘటనలో తండ్రిని దోషిగా తేల్చిన ప్రత్యేక న్యాయమూర్తి పవాస్ శ్రీవాస్తవ.. ఐపీసీతో పాటు, పోక్సో చట్టంలోని పలు నిబంధనల ప్రకారం 20 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా "తనపై జరిగిన దుర్మార్గాన్ని చిన్నారి కోర్టులో నిలదీసింది. తండ్రి మంచివాడు కాదని చెప్పింది" అని ఆయన వ్యాఖ్యానించారు.

గతేడాది జనవరిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రైవేట్ భాగాలపై గాయంతో బాధపడుతున్న ఆమెను తల్లి గమనించగా జరిగిన ఘోరం బయటపడింది.

స్నానం చేయిస్తుండగా..

ఐదేళ్ల చిన్నారిపై పొరుగింట్లో ఉండే 20 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర భీవండీలోని శాంతినగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోక్సో సహా.. ఐపీసీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు. పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను నిందితుడు నారధం చేయిపట్టుకుని తన ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాధితురాలిని తన తల్లి స్నానం చేయమని ఎంత చెప్పినప్పటికీ చిన్నారి చేయలేదు. చివరకు తల్లి స్నానం చేయిస్తుండగా విషయం బయటపడింది. దీనితో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.