ETV Bharat / bharat

రైల్లో సిగరెట్ తాగితే మూడేళ్ల జైలు.. రూ.1000 జరిమానా! - రైల్వేలో సిగరెట్​ తాగడం నిషేధం

రైళ్లలో ఇటీవల భారీగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో తీవ్రమైన చర్యలు ప్రకటించింది రైల్వే శాఖ. రైళ్లలో ధూమపానం చేయడం, మండే వస్తువులను తీసుకెళ్లేవారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించనుంది.

Railways announces initiatives against smoking, carrying inflammable items
రైల్లో సిగరెట్ తాగితే మూడేళ్ల జైలు.. రూ.వెయ్యి జరిమానా
author img

By

Published : Mar 24, 2021, 5:20 AM IST

రైళ్లలో సిగరెట్‌, బీడీలు తాగడం, మండే స్వభావం ఉన్న వస్తువులను వెంట తీసుకెళ్లేవారికి భారీగా శిక్షలు విధించనుంది రైల్వే శాఖ. ఈ నేరానికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.వెయ్యి జరిమానా లేదా రెండూ పడనుంది. దాంతో పాటు మరో రూ.500 జరిమానా విధించనుంది.

ఇటీవల జరిగిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఎస్‌-5 బోగీ మంటల్లో చిక్కుకోవడానికి సిగరెట్‌ లేదా బీడీ కారణమని ప్రాథమిక నివేదికలు పేర్కొంటున్న నేపథ్యంలో రైల్వే శాఖ ఆ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

7 రోజుల అవగాహన కార్యక్రమం..

అగ్ని ప్రమాదాల నివారణపై ప్రయాణికులు, ఉద్యోగులు సహా మిగిలినవారికి పూర్తి స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని జోనల్ రైల్వేలకు రైల్వే శాఖ సూచించింది. ఈ మేరకు 7 రోజుల అవహగాహన కార్యక్రమం ప్రారంభించాలని పేర్కొంది.

కరపత్రాలు ముద్రించడం, స్టిక్కర్లు అంటించడం, వీధి నాటకాల ప్రదర్శన, మైకుల ద్వారా ప్రచారం, అన్ని రకాల మీడియా ద్వారా ప్రచారం వంటి చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఇదీ చదవండి: దిల్లీ, ముంబయిలో హోలీ వేడుకలు నిషేధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.