Modi Brother Car Accident: కర్ణాటకలోని మైసూర్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడి బెంజ్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ దామోదర్ దాస్ మోదీతో పాటు ఆయన కుటుంబసభ్యులకు గాయాలయ్యాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం మోదీ తమ్ముుడు ప్రహ్లాద్ దామోదర్ దాస్‌తో పాటు ఐదుగురు కుటుంబసభ్యులు.. బెంజ్ కారులో బయలుదేరారు. మైసూరు నుంచి బందీపుర్ వైపు వెళ్తుండగా కడకోల సమీపంలో రోడ్డు డివైడర్‌ను కారు ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు.

ప్రహ్లాద్ దామోదర్ దాస్ మోదీ కుటుంబసభ్యులను మైసూర్‌లోని జేఎస్ఎస్ ఆస్పతికి తరలించారు. ప్రహ్లాద్ ముఖానికి గాయమైనట్లు పోలీసులు చెప్పారు. ఆయన కుమారుడు, కోడలు, మనవడు, డ్రైవర్ స్వల్పంగా గాయపడినట్లు తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు ప్రకటించారు.
కారు ఎయిర్‌బ్యాగ్స్ సకాలంలో తెరుచుకోవడం వల్లే అందరూ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారని సమాచారం.