Farm Laws Repeal: మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ఆమోదం తెలిపారు. దీంతో వివాదానికి కారణమైన ఈ మూడు చట్టాల రద్దు ప్రక్రియ పూర్తయింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే (సోమవారం) ఈ మూడు చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రవేశపెట్టారు. తొలుత లోక్‌సభ, తర్వాత రాజ్యసభలో.. ఎలాంటి చర్చా లేకుండానే ఈ బిల్లు ఆమోదం పొందింది.
వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఏడాదిగా దిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హరియాణా, యూపీ రైతులు ఆందోళన చేపట్టారు. పంజాబ్, యూపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం రద్దు నిర్ణయం తీసుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇదీ చూడండి : రాజస్థాన్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం యూపీలో నిరసన- ఎందుకిలా?