ETV Bharat / bharat

'కశ్మీర్​లో క్షేత్రస్థాయికి ప్రజాస్వామ్యం.. కొత్త పంథాలో అభివృద్ధి' - మోదీ కాశ్మీర్

PM Modi Jammu: 370వ అధికరణ రద్దుతో జమ్ముకశ్మీర్​లో ప్రజాస్వామ్యం క్షేత్రస్థాయికి చేరిందని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఊపునిచ్చేలా పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. దీనివల్ల స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని ఆదివారం జమ్మూ పర్యటన సందర్భంగా పేర్కొన్నారు.

narendra modi kashmir
pm modi jammu
author img

By

Published : Apr 24, 2022, 2:37 PM IST

Updated : Apr 24, 2022, 3:19 PM IST

PM Modi Jammu: జమ్ముకశ్మీర్​లో అభివృద్ధికి ఊతమిచ్చేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన అనంతరం ఆదివారం తొలిసారి ఆ ప్రాంతానికి పర్యటనకు వెళ్లారు మోదీ. భారత కళలు, సాంస్కృతిక వారసత్వ సంస్థ ఇన్‌టాక్‌ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలను సందర్శించారు. ఈ సందర్భంగా రూ.20వేల కోట్ల విలువైన అభివృద్ధి (అనుసంధానం, విద్యుత్​కు సంబంధించినవి) ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రూ.3,100 కోట్లతో నిర్మించిన బనిహాల్‌-కాజీగుండ్‌ సొరంగ మార్గాన్ని మోదీ జాతికి అంకితం చేశారు. 108 జన ఔషధీ కేంద్రాలను, సౌర విద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. రూ. 7,500 కోట్ల రూపాయలతో నిర్మించనున్న దిల్లీ-అమృత్‌సర్‌-కాట్రా ఎక్స్‌ప్రెస్‌ రహదారి, చీనాబ్‌ నదిపై నిర్మించనున్న రెండు జల విద్యుత్‌ ప్రాజక్టులకు కూడా శంకుస్థాపన చేశారు. నేడు (ఏప్రిల్ 24) పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలోని పంచాయతీలను ఉద్దేశించి సాంబా జిల్లాలోని పల్లీ గ్రామంలో ప్రసంగించారు. పంచాయతీ రాజ్ వ్యవస్థ.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేస్తుందని అన్నారు.

"జమ్ముకశ్మీర్​ను త్వరితగతిన అభివృద్ధి పరిచేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాల వల్ల ఇక్కడి యువతకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. (ఆర్టికల్ 370 రద్దు తర్వాత) జమ్ముకశ్మీర్​లో ప్రజాస్వామ్యం క్షేత్రస్థాయికి చేరిన అనంతరం ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీలతో సమావేశం కావడం గర్వంగా ఉంది. ప్రజాస్వామ్యం అమలు, అభివృద్ధి పనులను చేపట్టడంలో ఈ ప్రదేశం కొత్త ఉదాహరణగా నిలవనుంది. గడిచిన రెండు, మూడేళ్లలో ఇక్కడ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోంది"

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఏళ్లుగా రిజర్వేషన్ ప్రతిఫలాలు పొందలేకపోయిన జమ్ముకశ్మీర్​ ప్రజలు 370వ అధికరణ రద్దు అనంతరం దాని ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు మోదీ. స్వయంప్రతిపత్తి రద్దు తర్వాత జమ్ముకశ్మీర్​లో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోందని, ప్రజలు అందులో భాగస్వాములవుతున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం విషయంలో అయినా, అభివృద్ధి సంకల్పం విషయంలో అయినా జమ్ముకశ్మీర్ ఇప్పుడు యావత్‌ దేశానికి ఒక కొత్త ఉదాహరణగా నిలుస్తోందన్నారు మోదీ. ఏక్‌ భారత్‌-శ్రేష్ఠ భారత్‌ గురించి మాట్లాడితే మా దృష్టి అనుసంధానతపైనా, దూరాలను తగ్గించడంపైనా ఉంటుందని.. ఆ దూరాలు హృదయాల మధ్య అయినా, భాషా వ్యవహారాల మధ్య అయినా, వనరుల మధ్య అయినా, వాటిని దూరం చేయడం ఇప్పుడు ప్రాథమిక అంశమని నొక్కిచెప్పారు. మోదీ పర్యటనకు ముందు ఇటీవల జమ్ముకశ్మీర్‌లో ఉగ్రకుట్రను భగ్నం చేయడం సహా వేర్వేరు ఎన్‌కౌంటర్‌ ఘటనలు జరిగిన నేపథ్యంలో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి: మోదీ పర్యటనకు ముందు పేలుడు- అంతా టెన్షన్​ టెన్షన్​!

Last Updated : Apr 24, 2022, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.