ETV Bharat / bharat

దసరా పండుగ వేళ భారీ కుట్ర!.. భాజపా, ఆర్​ఎస్ఎస్ నేతలే 'పీఎఫ్ఐ' టార్గెట్​!!

PFI Ban In India : పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) నేతల ఇళ్లు, కార్యాలయాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సోదాల తర్వాత.. ఆ సంస్థ గురించి అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్ర నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పీఎఫ్‌ఐ కుట్రలు పన్నుతున్నట్లు తాజాగా వార్తలు బయటికొచ్చాయి. మరోవైపు పీఎఫ్‌ఐ సంస్థను చట్టవ్యతిరేక కార్యాకలాపాల నిరోధక చట్టం కింద కేంద్రం నిషేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

pfi ban in india
పీఎఫ్ఐ
author img

By

Published : Sep 26, 2022, 9:26 PM IST

PFI Ban In India : దేశంలో ఉగ్రదాడులకు సంబంధించి పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) పన్నిన పన్నాగాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ అగ్ర నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడాలని పీఎఫ్‌ఐ చూసినట్లు తాజాగా వెల్లడైంది. మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం వర్గాలు చేపట్టిన దర్యాప్తులో కీలక విషయాలు బయటకొచ్చాయి. నాగ్‌పుర్‌లోని ఆర్​ఎస్​ఎస్ ప్రధాన కార్యాలయం కూడా పీఎఫ్‌ఐ టార్గెట్‌ లిస్ట్‌లో ఉందని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి.

దసరా వేళ మహారాష్ట్రలో ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ సభ్యుల కదలికలపై నిఘా పెట్టాలని పీఎఫ్ఐ ప్రణాళికలు చేసినట్లు సమాచారం. వీరిని టార్గెట్‌ చేసుకుని దేశంలో.. మత విద్వేషాలను రెచ్చగొట్టాలని కుట్రలు పన్నుతున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. భాజపా, సంఘ్‌ నేతలతో పాటు పలు ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారులు కూడా వీరి హిట్‌ లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని ఆర్​ఎస్​ఎస్​ కార్యాలయాలపై ఈ సంస్థ సభ్యులు రెక్కీలు కూడా నిర్వహించినట్లు ఇదే విషయాన్ని నిఘా వర్గాలు కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా నేతలు, సంస్థలకు భద్రతను కట్టుదిట్టం చేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

2047 నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనే ఎజెండాతో పనిచేస్తున్న ఆరుగురు వ్యక్తులను యూపీ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌ శనివారం అరెస్టు చేసింది. వారి నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. ఇలా ఒక్కొక్కటిగా పీఎఫ్‌ఐ సంబంధించిన ఉగ్ర కుట్రలు బయటపడుతుండడం వల్ల.. కేంద్ర దర్యాప్తు బృందాలు అప్రమత్తమయ్యాయి. పీఎఫ్‌ఐ ఉగ్రకార్యకలాపాలను అడ్డుకునేందుకు.. ఆ సంస్థపై నిషేధం విధించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

చట్టవ్యతిరేక కార్యాకలాపాల నిరోధక చట్టం-యూఏపీఏ కింద ఈ నిషేధం విధించేందుకు ఉన్న అవకాశాలను జాతీయ భద్రత ప్రణాళికదారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అల్‌ఖైదా, జైషే మెుహమ్మద్‌, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలకు, ప్రపంచ జిహాదీ గ్రూపులకు పీఎఫ్‌ఐ ఓ నియామక సంస్థగా పనిచేస్తున్నట్లు ఎన్‌ఐఏ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో దాని ఆధారంగా పీఎఫ్‌ఐపై నిషేధం విధించాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గతవారం పీఎఫ్‌ఐ నేతల ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్‌ఐఏ, ఇతర దర్యాప్తు ఏజెన్సీలతో కలిసి ఆకస్మిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా పీఎఫ్‌ఐ సభ్యులను అరెస్టు చేశారు. అత్యధికంగా కేరళలో 22, మహారాష్ట్రలో 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సోదాల్లో ఎన్‌ఐఏ పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ సంస్థ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని, యువతను ఉగ్రవాదంవైపు ప్రేరేపిస్తోందని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది.

ఇవీ చదవండి: CUET-UG ఫలితాలు విడుదల.. మీ ర్యాంకు​ చెక్ చేసుకున్నారా?

'నాకున్న బలమేంటో అప్పుడు చూస్తారు!'.. అధ్యక్ష ఎన్నికలపై శశిథరూర్ కామెంట్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.