ETV Bharat / bharat

హత్య కేసులో చిలుక 'సాక్ష్యం'.. నిందితులకు జీవిత ఖైదు

సాధారణంగా పోలీసులు విచారణలో సాక్షులు వాంగ్మూలం ఇస్తారు. అది కూడా మనుషులు అయి ఉండాలి. కానీ ఒక హత్య కేసులో ఓ చిలుక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితులకు జీవితఖైదు పడింది. ఇంతకీ ఆ చిలుక ఏం చెప్పింది? పోలీసులు హత్య కేసు ఎలా ఛేదించారో? తెలుసుకోవాలంటే ఈ వార్త చదివేయండి.

parrot testimony parrot witness case up
parrot testimony parrot witness case up
author img

By

Published : Mar 25, 2023, 7:27 AM IST

తొమ్మిదేళ్ల క్రితం నాటి మర్డర్​ కేసులో ఓ సాక్షి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితురాలిని పోలీసులు విచారించారు. ఆ కేసులో పోలీసులు సమర్పించిన ఛార్జ్‌షీట్ ఆధారంగా.. కోర్టు ఆమెను దోషిగా నిర్థారించి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. పోలీసు విచారణలో సాక్షులు వాంగ్మూలం ఇవ్వడం సాధారణ విషయమే! ఇందులో ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా? ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చిన సాక్షి మనిషి కాదు.. ఓ చిలుక. అదేంటీ.. జంతువులు, పక్షుల సాక్ష్యం చెల్లదు కదా అంనుకుంటున్నారా? అయితే, చిలుక వాంగ్మూలం ఇచ్చింది న్యాయస్థానంలో కాదు.. పోలీసుల విచారణలో. నేరస్థులను గుర్తించేందుకు ఆ చిలుకే సాయపడింది. చిలుక ఏం చెప్పిందో.. అదేలా విచారణకు ఉపయోగపడిందో తెలుసుకుందాం.

అసలు ఏం జరిగిందంటే.. ఉత్తర్​ప్రదేశ్​లోని ఆగ్రాకు చెందిన విజయ్‌ శర్మ అనే వ్యక్తి భార్య నీలమ్‌ శర్మ 2014 ఫిబ్రవరి 20న ఇంట్లో హత్యకు గురైంది. నిందితులు ఆమెను, వారి పెంపుడు కుక్కను పదునైన ఆయుధంతో పలుమార్లు పొడిచి దారుణంగా హత్య చేసినట్టు పోస్టుమార్టం పరీక్షల నివేదికలో వెల్లడైంది. ఈ కేసులో అనుమానితులుగా కొంతమందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించినా.. సరైన సాక్ష్యాధారాలు దొరకలేదు. హత్య జరిగిన తర్వాతి రోజు నుంచి విజయ్‌ శర్మ పెంపుడు చిలుక సరిగా తినకుండా.. అతడి మేనకోడలు అషు ఇంటికి వచ్చిన ప్రతిసారీ ఆమెను చూసి అరిచేది. దీంతో హత్య చేసిన వారిని చిలుక చూసి ఉంటుందని విజయ్​ శర్మ అనుమానించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు.

ఈ హత్య కేసులో గతంలో విచారించిన అనుమానితులతోపాటు విజయ్​ శర్మ మేనకోడలు అషును కూడా పోలీసులు చిలుక ముందు నిలబెట్టారు. అప్పుడు కూడా చిలుక అషును చూసి అరిచింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పుడే అసలు విషయం బయటపడింది. రోన్నీ అనే వ్యక్తితో కలిసి తానే నీలమ్‌ శర్మను నగలు, డబ్బు కోసం హత్య చేసినట్లు అషు అంగీకరించింది. అయితే, పోలీసులు ఛార్జ్‌షీట్‌లో చిలుక వాంగ్మూలం గురించి ప్రస్తావించినప్పటికీ.. దాన్ని మాత్రం సాక్షిగా కోర్టులో ప్రవేశపెట్టలేదు. హత్య జరిగిన ఆరు నెలల తర్వాత చిలుక చనిపోయిందని.. 2020 నవంబరులో విజయ్‌ శర్మ కరోనాతో మృతి చెందాడని అతడి కుమార్తె నివేదా తెలిపింది. తాజాగా ఈ కేసులో తీర్పు వెలువరించిన స్పెషల్​ కోర్టు జడ్జి దోషులిద్దరికీ జీవిత ఖైదు విధించారు.

లిక్కర్​ మాఫియా కేసులో చిలుకను విచారించిన పోలీసులు..
నిందితులను పట్టుకునేందుకు పోలీసులు మనుషులను విచారించిన ఘటనలు చాలానే చూశాం. అయితే లిక్కర్ మాఫియా గ్యాంగ్​ను పట్టుకునేందుకు బిహార్​ పోలీసులు విచిత్రంగా ఓ చిలుకను విచారించారు. ఈ పూర్తి వార్త ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.