ETV Bharat / bharat

పెగసస్, నిరుద్యోగంపై చర్చకు విపక్షాల డిమాండ్​ - అఖిలపక్ష సమావేశం న్యూస్

All Party Meeting Today: సోమవారం(నవంబరు 29) పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసింది కేంద్రం. పెగసన్, ధరల పెరుగుదల, నిరుద్యోగం.. తదితర సమస్యలపై చర్చలు జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్​ చేశాయి.

All Party Meeting
అఖిలపక్ష సమావేశం
author img

By

Published : Nov 28, 2021, 1:53 PM IST

Updated : Nov 28, 2021, 2:36 PM IST

All Party Meeting Today: పెగసస్​ వ్యవహారం, ధరల పెరుగుదల, నిరుద్యోగమే ప్రధాన అస్త్రాలుగా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్రాన్ని ఇరుకునపెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. పార్లమెంటు ఆవరణలో ఆదివారం జరిగిన అఖిలపక్ష భేటీలో ఈమేరకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి. సోమవారం నుంచి జరిగే శీతాకాల సమావేశాల్లో ఆయా అంశాలను చర్చకు చేపట్టాలని డిమాండ్ చేశాయి.

All Party Meeting
అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న నేతలు

బంగాల్​తోపాటు ఇతర రాష్ట్రాల్లో సరిహద్దు భద్రత దళం(బీఎస్‌ఎఫ్‌) అధికార పరిధిని విస్తృతం చేయడంపైనా ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తినట్లు అధికారవర్గాలు తెలిపాయి.

"ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు పెరుగుదల, రైతు సమస్యలు, కొవిడ్​-19.. తదితర అంశాలపై ప్రశ్నలను అఖిలపక్ష సమావేశంలో కేంద్రంపై సంధించాం. కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని అన్నిపార్టీలు డిమాండ్ చేశాయి. కొవిడ్​-19 బాధిత కుటుంబాలకు రూ. 4లక్షల పరిహారం ఇవ్వాలని, రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు పరిహారం అందించాలని మేము డిమాండ్​ చేశాం.ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరవుతారని భావించాం. కానీ హాజరుకాలేదు. కేంద్రం రైతు చట్టాలను రద్దు చేసింది.. రైతులకు అర్థమయ్యేలా వివరించడంలో విఫలమయ్యామని ప్రధాని మోదీ అన్నారు. అంటే దీని అర్థం.. భవిష్యత్తులో మరో విధంగా రైతు చట్టాలను తీసుకురావచ్చు."

-- మల్లికార్జున ఖర్గే, రాజ్యసభ ప్రతిపక్ష నేత

కనీస మద్దతు ధర(ఎమ్​ఎస్​పీ)పై చట్టాలు చేయడం, లాభదాయక ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ.. తదితర అంశాలను తృణమూల్ కాంగ్రెస్​ నేతలు సుదీప్ బందోపాధ్యాయ, దెరెఖ్​ ఓబ్రియన్​ లేవనెత్తినట్లు సమాచారం.

అఖిలపక్ష సమావేశంలో నేతలు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదు. కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని నేను డిమాండ్​ చేశాను. సరిహద్దు భద్రత దళం(బీఎస్‌ఎఫ్‌) అధికార పరిధిని విస్తృతం చేయడంపైనా ప్రశ్నలు లేవనెత్తాను.

-- సంజయ్​ సింగ్, ఆమ్​ఆద్మీ పార్టీ ఎంపీ

'చర్చకు సిద్ధం'

మొత్తం 31 పార్టీలు అఖిలపక్ష భేటీకి హాజరయ్యాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. 42 మంది రాజకీయనేతలు పాల్గొన్నట్లు వివరించారు. స్పీకర్​/ఛైర్మన్​ అనుమతించిన అన్ని అంశాలపై ప్రభుత్వం చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.

All Party Meeting
సమావేశంలో పాల్గొన్న నేతలు
All Party Meeting
అఖిలపక్ష సమావేశం
All Party Meeting
అఖిలపక్ష సమావేశం అనంతరం రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్ అభివాదం

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం(నవంబరు 29) ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 23 వరకు జరగనున్నాయి.

ఇదీ చూడండి: 'అధికారం కాదు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం'

Last Updated : Nov 28, 2021, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.