ఎన్నికలలో గెలుపు, ఓటమిలు సహజం. గెలిచిన వ్యక్తిని ఓడిన అభ్యర్థి కోపంతో ఊగిపోయి తిట్టడం, కొన్నిసార్లు చేయిచేసుకోవడం వంటి ఘటనలను చూసే ఉంటాం. కానీ మహారాష్ట్రలో వాటిన్నంటికి భిన్నంగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఔరంగాబాద్‌లోని ఇటీవలే పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన రాంభౌ దావండే తోటలో ఉన్న 350 బొప్పాయి చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
బొప్పాయి తోట కోసం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టిన రాంభౌ.. పొద్దునే లేచి తన పొలంలో నరికేసి ఉన్న చెట్లను చూసి షాక్‌కు గురయ్యాడు. దీంతో దౌల్తాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
![papaya-garden-has-been-cut-by-opposition-after-daughter-in-law-won-gram-panchayat-elections-in-maharashtra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-aur-1-farmer-loss-7206289_23122022145009_2312f_1671787209_711.jpg)
అయితే రెండు రోజులు క్రితమే వెలువడ్డ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో బాధితుడు రాంభౌ దావండే గెలుపొందాడు. అదే ఎన్నికల్లో దావండే కోడలు సన్బాయి పోటీ చేసి ఓడిపోయింది. దీంతో మామపై కోపం పెంచుకున్న కోడలు.. అతడి బొప్పాయి తోటను ధ్వంసం చేయించిందని స్థానికులు అంటున్నారు.
![papaya-garden-has-been-cut-by-opposition-after-daughter-in-law-won-gram-panchayat-elections-in-maharashtra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mh-aur-1-farmer-loss-7206289_23122022145009_2312f_1671787209_906.jpg)