Pakistan Drone Shot Down: భారత సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల కలకలం కొనసాగుతూనే ఉంది. తాజాగా పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ డ్రోన్‌ను గుర్తించిన భద్రతా బలగాలు కాల్పులు జరిపి నేలకూల్చాయి. అమృత్‌సర్ జిల్లా రాజతాల్ గ్రామంలో ఆదివారం రాత్రి 7గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సైన్యం ప్రకటించింది. డ్రోన్‌ను కూల్చిన ప్రాంతంలో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.
![Pak drone shot down by BSF in Punjab](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17311811_jike.jpg)
వారం రోజుల్లో మూడు డ్రోన్లను..
పంజాబ్‌లో గత వారం రోజుల్లో మూడు పాకిస్థాన్ డ్రోన్‌లను సరిహద్దు దళం కూల్చివేసింది. చలికాలం కావడం వల్ల సరిహద్దుల్లో పొగ మంచు అధికంగా ఉంటోంది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న పాకిస్థాన్ డ్రోన్ల ద్వారా మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని సందర్భాల్లో మాదక ద్రవ్యాలు ఉన్న ప్యాకెట్లను సరిహద్దుల్లోని పంటపొలాల్లో పాక్ డ్రోన్లు జార విడుస్తున్నట్లు వివరించారు.
ఇవీ చదవండి: