ONGC Apprentices Recruitment: భారత ప్రభుత్వ రంగ సంస్థ.. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్జీసీ) దేశవ్యాప్తంగా మొత్తం 3,614 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తు కోరుతోంది. కొద్ది రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా.. దరఖాస్తు గడువును మరో వారం పొడిగించింది ఓఎన్జీసీ. దీనికి సంబంధించి తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.
అకౌంట్స్, ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిసెంట్లు, ఎలక్ట్రీషియన్, సెక్రటేరియల్ అసిస్టెంట్, ఫిట్టర్ తదిత విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. విద్యార్హతలను బట్టి ఆయా పోస్టులకు అర్హులుగా ఉంటారు. అర్హత పరీక్షలో మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్‌ను ఎంపిక చేస్తారు. సెక్టార్ల వారీగా నార్నర్త్ సెక్టార్- 209, ముంబయి- 305, వెస్టర్న్- 1434, ఈస్టర్న్- 744, సదర్న్ సెక్టార్- 694, సెంట్రల్ సెక్టార్లో 228 ఖాళీలు ఉన్నాయి.
- అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్, డిప్లొమా, బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ(2019,20,21,22) ఉత్తీర్ణత.
- వయసు: 15.05.2022నాటికి 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వరకు వయసు సడలింపు ఉంటుంది.
- దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి
- చివరి తేదీ: 2022 మే 22 సాయంత్రం 6 గం. వరకు
- వెబ్సైట్: www.ongcindia.com
ఇదీ చదవండి: ప్రాణం తీసిన 'ఉప్పు'.. గోడ కూలి 12 మంది దుర్మరణం
స్కూల్ ముందే అమ్మాయిల భీకర ఫైట్.. జుట్లు పట్టుకుని, పిడిగుద్దులతో..