ETV Bharat / bharat

26 సార్లు ట్రాఫిక్ రూల్స్​ ఉల్లంఘన.. రూ.16 వేలు ఫైన్.. బైకర్ ఏం చేశాడంటే? - బైకర్​కు 16 వేలు జరిమానా

ఓ బైకర్​ ఏకంగా 26 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడు. అతడికి పోలీసులు రూ.16 వేలు జరిమానా విధించారు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.

traffic violation fine
వాహనదారుడికి చలాన్లు అందిస్తున్న పోలీసులు
author img

By

Published : Dec 27, 2022, 8:56 PM IST

Updated : Dec 28, 2022, 7:33 AM IST

కర్ణాటకలోని దావణగెరెకు చెందిన ఓ బైకర్ 26 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడు. దీంతో అతడికి ట్రాఫిక్ పోలీసులు రూ.16 వేలు జరిమానా విధించారు. ​ఈ జరిమానాను బైక్​ యజమాని వీరేశ్​ చెల్లించాడు.

ఇదీ జరిగింది..
దావణగెరెకు చెందిన వీరేశ్​ 26 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడు. అందులో హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు 23 కేసులు, బైక్ నడుపుతూ ఫోన్​లో మాట్లాడినందుకు 3 కేసులు నమోదయ్యాయి. ఇలా వీరేశ్ ట్రాఫిక్ నిబంధనలకు ఉల్లంఘించి బైక్​ నడపడం స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు జరిమానా కట్టమని నోటీసులు పంపారు. అయినా వాహన యజమాని వీరేశ్ ఇవేమి పట్టించుకోలేదు. సోమవారం పోలీసులకు వీరేశ్​ పట్టుబడగా.. జరిమానా చెల్లించాలని కోరారు. దీంతో పెండింగ్​లో ఉన్న మొత్తం జరిమానాలను ఒకేసారి చెల్లించాడు.

traffic violation fine
వాహనదారుడికి చలాన్లు అందిస్తున్న పోలీసులు
traffic violation fine
చలాన్లు

Last Updated : Dec 28, 2022, 7:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.