Shivratri 2022: శివరాత్రి పర్వదినం సందర్భంగా దేశంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు.ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.
శివరాత్రి పర్వదినాన గోరఖ్నాథ్ ఆలయంలో ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. మహాశివునికి ప్రత్యేక పూజలు చేశారు.

ఒడిశా సైకత శిల్పి.. సుదర్శన్ పట్నాయక్ 23,436 రుద్రాక్షలతో పూరీ బీచ్లో శివుని విగ్రహాన్ని ఇసుకతో రూపొందించాడు.

గాజు సీసాలోనే శివలింగం..
ఒడిశాలోని కుర్దాకు చెందిన ఎల్ ఈశ్వర్రావు అనే సూక్ష్మ కళాకారుడు గాజు సీసాలో శివలింగాన్ని తీర్చిదిద్దాడు. ఈ శివలింగంలో శేషనాగు, త్రిశూలం కూడా ఉన్నాయి. మట్టి, పేపరుతోనే 5 అంగుళాల పొడవు, 2.5 అంగుళాల వెడల్పు గల శివలింగం ఇది. ఇలా గాజు సీసాలో కళాఖండాన్ని తయారుచేయడానికి వారం రోజులు పట్టిందని ఈశ్వర్రావు తెలిపారు.


ఇదీ చదవండి: 'తమిళనాడుతో పాటు దేశ ప్రజలను అవమానించిన మోదీ!'