ఒడిశా భువనేశ్వర్‌కు చెందిన యాసిడ్ దాడి బాధితురాలు ప్రమోదిని రౌల్ వివాహం చేసుకుని ఎంతోమంది యాసిడ్ బాధితులకు ఆదర్శంగా నిలిచారు. తన చిరకాల స్నేహితుడు సరోజ్ సాహూను సోమవారం సాయంత్రం వివాహమాడారు. ఇది తన జీవితంలో మర్చిపోలేని ఘట్టమని సంతోషం వ్యక్తం చేశారు రౌల్. ఈ సందర్భంగా 2009లో తనపై జరిగిన యాసిడ్ దాడి.. చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
'యాసిడ్ దాడి బాధితులు కుంగిపోవద్దు, కలలు కనండి.. వాటికోసం పోరాడండి. మీరేమీ తక్కువకాదు' అని సందేశమిచ్చారు రౌల్. కష్ట కాలంలో తనకు అండగా ఉన్న ఒడిశా రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
సరోజ్ సాహూ, ప్రమోదిని రౌల్ 2014లో ఆసుపత్రిలో కలిశారు. 2018లో వారి నిశ్చితార్థం జరిగింది. సోమవారం సాయంత్రం ఒడిశా జగత్సింగ్పుర్ జిల్లా కనక్పుర్లో వారి వివాహం జరిగింది. ఈ వేడుకకు అనేక మంది యాసిడ్ దాడి బాధితులు హాజరయ్యారు.
2009, మే 4 న ఓ ఆర్మీ అధికారి.. ప్రమోదిని రౌల్‌పై యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనతో దాదాపు 5ఏళ్లు ఇంటికే పరిమితమయ్యారు రౌల్.
ఇదీ చదవండి : వితంతు పెళ్లిపై కులపెద్దల ఆగ్రహం.. గ్రామ బహిష్కరణ