ETV Bharat / bharat

కాలేజీ సర్టిఫికెట్ల కోసం కూలీ పని - మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం

ఒడిశాలోని ఓ ప్రైవేటు కాలేజీలో సివిల్​ ఇంజినీరింగ్​లో డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థికి పేదరికం అడ్డుపడింది. ప్రతిభతో విద్యను పూర్తి చేసినా.. ఫీజు కట్టలేకపోవడం వల్ల ఆ కాలేజీ యాజమాన్యం సర్టిఫికేట్లు ఇవ్వలేదు. చివరికి చేసేది ఏమీ లేక బకాయిలు తీర్చేందుకు కూలీపనిలో చేరింది ఆ విద్యార్థిని.

od_01_bram_jantrink mati kama_sp story_od10012
కాలేజీ సర్టిఫికెట్ల కోసం వంద రోజుల కూలీకి బెహెరా
author img

By

Published : Jan 27, 2021, 3:56 PM IST

"ధనం మూలం ఇధం జగత్​.." ఆధునిక ప్రపంచానికి ఈ వ్యాఖ్యలు సరిపోతాయి. కొన్ని సందర్భాల్లో తెలివితేటలు ఉన్నప్పటికీ.. డబ్బు లేకపోతే ఎవరూ పట్టించుకోని పరిస్థితి. పేదల్లో ఇది మరింత దారుణంగా ఉంటుంది. ఒడిశాలోని లోజీ బెహెరాది కూడా ఇదే దుస్థితి. సొంత ప్రతిభతో చదువు పూర్తి చేసినప్పటికీ.. కాలేజీ ఫీజు కట్టలేదని ఆమెకు సర్టిఫికేట్లు ఇవ్వలేదు కాలేజీ యాజమాన్యం. చివరికి వాటి కోసం కూలీ పనిలో చేరింది విద్యార్థిని.

కాలేజీ సర్టిఫికెట్ల కోసం కూలీ పని

కూలీ పనికి..

ఒడిశాలోని పూరి జిల్లా బ్రహ్మగిరిలో నివసించే లోకనాథ బెహెరా కుమార్తె లోజీ బెహెరా. 2019లో ప్రైవేట్ కళాశాల నుంచి సివిల్ ఇంజనీరింగ్​లో డిప్లొమా పూర్తి చేసింది. కానీ కాలేజీ బకాయిలు(రూ.24,000 ) చెల్లించాల్సిన కారణంగా ఆమెకు ధ్రువపత్రాలను ఇవ్వడానికి నిరాకరించింది యాజమాన్యం. ఇక చేసేది ఏమీ లేక.. చివరికి బకాయిలు తీర్చేందుకు.. మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(ఎమ్​జీఎన్​ఆర్​ఈజీఏ)లో కూలీగా చేరింది. ప్రస్తుతం రోజుకు రూ.207 సంపాదిస్తూ. . బకాయిలు చెల్లించేందుకు ఒక్కో రుపాయి కూడగడుతోంది. ప్రతిభా పాటవాలు, నైపుణ్యం ఉన్నప్పటికీ మట్టి ఎత్తే పనిలో చేరాల్సి వచ్చింది ఆ విద్యార్థిని.

సాయం కోసం వేడుకున్నా..

చెల్లించాల్సిన బకాయిల కారణంగా తన చదువులు ఆగిపోవడం ఇష్టంలేని లోజీ.. తన ధ్రువపత్రాలు ఇప్పిస్తే.. నెమ్మదిగా తీరుస్తానని కళాశాల అధికారులను వేడుకుంది. ఈ అంశంలో సహాయం చేయాల్సిందిగా ఖోర్దా నియోజకవర్గ ఎమ్మెల్యేనూ సంప్రదించింది. అయినా ఫలితం దక్కలేదు. పేదరికం కారణంగా ఆమె వినతులను ఎవరూ పట్టించుకోవడంలేదు.

చివరకు.. కళాశాల బకాయిలు తీర్చేందుకు స్వయంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకొన్నానని చెబుతోంది 'లోజీ బెహెరా'.

ఇదీ చదవండి: దేశసేవ చేయాలనే సంకల్పం ముందు ఓడిన పేదరికం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.