డబ్బులు సంపాదించలేకపోతున్నందున మూడేళ్ల క్రితం.. కన్న బిడ్డలే కాదనుకుని ఓ వృద్ధుడ్ని రైల్వే స్టేషన్లో విడిచిపెట్టారు. అనంతరం అక్కడే భిక్షాటన చేస్తూ జీవనం సాగించిన ఆ వ్యక్తి.. అనారోగ్యం కారణంగా కదలలేని స్థితిలో ఉన్నాడు. అతడ్ని గుర్తించిన ఓ డాక్టర్.. వెంటనే ఆస్పత్రిలో చేర్చి దగ్గరుండి వైద్యం చేయడం ప్రారంభించారు. అయితే వారికి ఓ సమస్య వచ్చింది. రోగి భాష డాక్టర్‌కు అర్థం కాలేదు. దీంతో వారి మధ్య మాటలు లేకుండా పోయాయి. అయినా సరే సిబ్బంది అతడి బాధను గుర్తించి.. 27 రోజులపాటు దగ్గరుండి సేవలు చేశారు. చివరకు రోగి మాట్లాడే భాష తెలిసిన ఆస్పత్రి సిబ్బంది ఒకరు.. మాటలు కలిపారు. అతడి బాధను తెలుసుకుని చలించిపోయాడు.
కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన రాజురామ్ గౌడ అనే వృద్ధుడ్ని అతని కుమారుడు మూడేళ్ల క్రితం మహారాష్ట్ర ఔరంగాబాద్ రైల్వే స్టేషన్లో విడిచిపెట్టారు. దీంతో అక్కడే రాజు భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవాడు. కొంతకాలంగా ఆరోగ్యం దెబ్బతిని కదలలేని స్థితిలో ఉన్న రాజును.. మహారాష్ట్రకు చెందిన డాక్టర్ బాలాసాహెబ్ శిందే గుర్తించి ఆస్పత్రిలో చేర్పించి. అతడికి అన్ని పరీక్షలు చేసి తగిన వైద్యం అందించారు. వైద్యులకు తన భాష అర్థం కాకపోయనా సరే తనపై చూపించిన ప్రేమకు.. వారిని దేవుళ్లుగా కొనియాడాడు రాజు. 27 రోజుల పాటు ఆస్పత్రిలో ఉండి.. కోలుకున్నాసరే అక్కడనుంచి వెళ్లడానికి నిరాకరించాడు. ప్రస్తుతం తనకు అందరూ ఉన్నా అనాథగా మారానని రాజు వారితో వాపోయాడు. దీంతో వైద్యబృదం దగ్గరుండి మరీ రాజును ఓ ఆశ్రమంలో చేర్పించారు. అక్కడ నుంచి వెళ్లే సమయంలో రాజు కన్నీటితో అందరికీ వీడ్కోలు పలికాడు.
ఇవీ చదవండి:
ఆడపిల్లగా పుట్టడమే పాపం.. 9 నెలల చిన్నారిని చంపిన తండ్రి.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి..
ఓవైపు పుట్టెడు దుఃఖం.. మరోవైపు పేదరికం.. తోపుడు బండిపైనే ఇంటికి మృతదేహం