No Confidence Motion In Indian Parliament : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అసలు సిసలైన ఘట్టానికి సర్వం సిద్ధమైంది. ఎన్డీఏ సర్కారుపై ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం చర్చ ప్రారంభం కానుంది. మణిపుర్ హింసపై పాలక, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. అవిశ్వాస తీర్మానంపై వాడీవేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. అనర్హత నుంచి ఉపశమనం పొందిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. ఆ పార్టీ తరఫున చర్చను ప్రారంభించనున్నారు. బుధ, గురు వారాల్లోనూ ( No Confidence Motion 2023 Date ) అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ కొనసాగనుంది. ఆగస్టు 10న (గురువారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీర్మానంపై మాట్లాడనున్నారు. ఆగస్టు 11న వర్షాకాల సమావేశాలు ముగుస్తాయి.
No Confidence Motion news : అవిశ్వాస తీర్మానాన్ని విపక్ష కూటమి 'ఇండియా' ప్రవేశపెట్టింది. గతవారం దీన్ని స్పీకర్ ఓంబిర్లా ఆమోదించారు. మణిపుర్ అంశంపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోదీ దీనిపై మాట్లాడాలని అడుగుతున్నాయి. అయితే, సభలో మణిపుర్ అంశం చర్చకు నోచుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విపక్షాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. తద్వారా ప్రధానితో మాట్లాడించవచ్చని భావిస్తున్నాయి. పార్టీల బలాబలాల ఆధారంగా స్పీకర్.. సభ్యులకు సమయాన్ని కేటాయించనున్నారు. అధికార పార్టీ ఎంపీలు మాట్లాడిన తర్వాత విపక్ష సభ్యులకు సమయం ఇస్తారు.
బీజేపీ విప్.. నిలదీసేందుకు కాంగ్రెస్ రెడీ
No Confidence Motion Congress vs BJP : అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార బీజేపీ.. ఇప్పటికే తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఆగస్టు 7 నుంచి 11 వరకు పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలంతా తప్పక హాజరు కావాలని స్పష్టం చేసింది. మరోవైపు, తమ గళాన్ని బలంగా వినిపించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. మోదీ సర్కారును అన్ని అంశాలపై తాము గట్టిగా నిలదీస్తామని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పష్టం చేశారు.
-
#WATCH | On restoration of Rahul Gandhi's Lok Sabha membership and on no-confidence motion discussion, Congress MP Shashi Tharoor says, "From tomorrow we will be analysing all the failures of the Modi-led government and I have no doubt that there will be strong participation from… pic.twitter.com/FvRpmbt9u3
— ANI (@ANI) August 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | On restoration of Rahul Gandhi's Lok Sabha membership and on no-confidence motion discussion, Congress MP Shashi Tharoor says, "From tomorrow we will be analysing all the failures of the Modi-led government and I have no doubt that there will be strong participation from… pic.twitter.com/FvRpmbt9u3
— ANI (@ANI) August 7, 2023#WATCH | On restoration of Rahul Gandhi's Lok Sabha membership and on no-confidence motion discussion, Congress MP Shashi Tharoor says, "From tomorrow we will be analysing all the failures of the Modi-led government and I have no doubt that there will be strong participation from… pic.twitter.com/FvRpmbt9u3
— ANI (@ANI) August 7, 2023
"మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై రేపటి నుంచి సభలో మాట్లాడతాం. చర్చలో కాంగ్రెస్ ఎంపీలు గట్టిగా మాట్లాడతారు. రాహుల్ గాంధీ సైతం మాట్లాడతారని అనుకుంటున్నా. మణిపుర్లో ప్రభుత్వ వైఫల్యాల నుంచి మొదలుకొని అన్ని అంశాలపై తీవ్రమైన చర్చ జరుగుతుందని భావిస్తున్నా. ప్రధానంగా మణిపుర్ విషయంపై చర్చించాలని మేమంతా అనుకుంటున్నాం."
-శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ
No Confidence Motion Lok Sabha : ప్రభుత్వాన్ని పడగొట్టే బలం విపక్ష కూటమికి లేదు. తమకు మెజారిటీ లేదని శశిథరూర్, కాంగ్రెస్ తరఫున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన గౌరవ్ గొగొయి ఇప్పటికే అంగీకరించారు. మణిపుర్‌పై ప్రభుత్వంతో మాట్లాడించేందుకే అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. ఈ అవిశ్వాస తీర్మానం వల్ల మోదీ సర్కారుకు వచ్చిన నష్టమేమీ లేకపోయినా.. ఓటింగ్ సరళి ఎలా ఉంటుందోననే విషయంపై ఆసక్తి నెలకొంది.
లోక్‌సభలో ఎన్డీఏకు 331 మంది సభ్యుల బలం ఉంది. ఒక్క బీజేపీకే 303 మంది ఎంపీలు ఉన్నారు. సభలో బలం నిరూపించుకునేందుకు కావాల్సిన మెజారిటీ 272. మరోవైపు, ఇండియా కూటమికి 144 మంది ఎంపీలు ఉన్నారు. తటస్థంగా ఉన్న బీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ పార్టీలకు 70 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో బీఆర్ఎస్.. అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికే అవకాశం ఉంది. పార్లమెంట్లో అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న వైసీపీ, బీజేడీ పార్టీల ఎంపీలు.. తీర్మానాన్ని వ్యతిరేకించనున్నట్లు తెలిపారు. ఈ లెక్కన ఎన్డీఏపై ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.