road construction world record: దేశీయ రహదారులకు కొత్త రూపునిస్తున్న జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ (NHAI) దేశం మొత్తం గర్వించేలా సరికొత్త రికార్డు నెలకొల్పింది. కేవలం 105 గంటల్లోనే 75 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించి ఖతార్ పేరిట ఉన్న గిన్నిస్ రికార్డును తిరగరాసింది. మహారాష్ట్రలోని అమరావతి- అకోలా జిల్లాల మధ్య ఈ రహదారి నిర్మాణాన్ని చేపట్టారు.
![road construction world record](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15505918_guinnes.jpg)
![road construction world record](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15505918_1.jpg)
మొత్తం 720 మంది కార్మికులు రేయింబవళ్లు కష్టించి ఈ నిర్మాణాన్ని పూర్తిచేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. జూన్ 3న ఉదయం 7.27కి ఈ పనులు ప్రారంభించగా.. జూన్ 7 సాయంత్రం 5 గంటలకు ఈ పనులు పూర్తయినట్లు మంత్రి ఓ వీడియో సందేశంలో వివరించారు. అలాగే రహదారి నిర్మాణ పనులు, గిన్నిస్ బుక్ వారు అందించిన సర్టిఫికెట్‌ను సైతం సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. గతంలో ఈ రికార్డు ఖతార్ పేరిట ఉండేది. 10 రోజుల్లో 25.275 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించి ఆ దేశం గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఈ రికార్డులో భాగస్వాములైన NHAI, రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లు, కార్మికులను మంత్రి అభినందించారు.
![road construction world record](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15505918_2.jpg)
ఇదీ చదవండి: రైతులకు కేంద్రం తీపి కబురు.. వరి కనీస మద్దతు ధర పెంపు